Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !

ఈ సీజ‌న్‌లో అధికంగా లభించే మామిడి పండ్ల‌ను చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఒక మోస్త‌రుగా మించి అధికంగా తింటే మాత్రం శ‌రీరంలో వేడి పెరుగుతుంది. విరేచ‌నాలు అవుతాయి. ఈ సీజ‌న్‌లో త‌క్కువ మోతాదులో మామిడిపంట్లను తీసుకోవాలి.

Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !

Foods To Avoid

Foods to Avoid in Summer : వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌లు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంద‌రికి ఈ సీజ‌న్‌లోనూ ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. ఇక ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరం వేడిగా ఉంటుంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి.

అలాగే క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఇక కొంద‌రు నీళ్ల‌ను తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శరీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డతారు. వడ దెబ్బ‌కు గుర‌వుతారు. కొన్ని సార్లు మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు కూడా ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.

READ ALSO : Summer Health Problems : వేసవి కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవే?

వేస‌వి సీజ‌న్‌లో ఆహారాల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా కొన్ని ర‌కాల ఆహారాల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోకపోవటమే మంచిది. కాదని తీసుకుంటే మాత్రం స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి అలాంటి ఆహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేస‌విలో స‌హ‌జంగానే మ‌న‌కు దాహం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మ‌ద్యం సేవిస్తే ఆ దాహం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో నాలుక పొడి బారిపోయి శ‌రీరం డీహైడ్రేష‌న్గు రవుతుంది. ఈ పరిస్ధితి వల్ల లివ‌ర్‌ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి వేస‌విలో మ‌ద్యం సేవించ‌డం ఏమాత్రం మంచిదికాదని గుర్తుంచుకోవాలి. వేసవిలో నూనెతో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోరాదు. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే విరేచ‌నాల‌వుతాయి. దాహం కూడా అధికంగా ఉంటుంది. ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.

ఈ సీజ‌న్‌లో అధికంగా లభించే మామిడి పండ్ల‌ను చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఒక మోస్త‌రుగా మించి అధికంగా తింటే మాత్రం శ‌రీరంలో వేడి పెరుగుతుంది. విరేచ‌నాలు అవుతాయి. ఈ సీజ‌న్‌లో త‌క్కువ మోతాదులో మామిడిపంట్లను తీసుకోవాలి. కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను, మాంసాహారాల‌ను తీసుకోవటం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. క‌డుపులో మంట వస్తుంది. కాబ‌ట్టి ఈ ఆహారాలను ప‌రిమిత మోతాదులో తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Precautions During Summer : వేసవి కాలంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించటం మంచిది !

బేక‌రీ ప‌దార్థాలు, ఇత‌ర జంక్ ఫుడ్స్‌ను తిన‌డం కూడా మానేయాలి. ఇవి దాహం అధికంగా అయ్యేలా చేస్తాయి. శ‌రీరంలో నీటి శాతాన్ని త‌గ్గిస్తాయి. ఇది మ‌న‌కు ఈ సీజ‌న్‌లో మంచిది కాదు. టీ, కాఫీల‌ను త‌గ్గించాలి. వీటిని అధికంగా తీసుకుంటే గ్యాస్‌, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను తాగడం మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.

డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, నేరేడు పండు మొదలైనవి వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి మరియు మీకు చిరాకు మరియు అలసటను కూడా కలిగిస్తాయి. ఐస్‌క్రీమ్‌లు వేసవిలో వేడి ఎదుర్కోవడానికి చాలా మంది వీటిని తీసుకుంటారు. వేసవి కాలంలో ఎక్కువ ఐస్ క్రీం తినడం వల్ల జలుబు సంబంధిత వ్యాధుల ప్రమాదం కలుగుతుంది.