Cat Pets : కుక్కల కన్నా పిల్లుల పెంపకమే మేలా.. ఎందుకంటే?..

ప్రస్తుతం ఇదే అలవాటు కొలకత్తా, పూణే, ధిల్లీ, నగరాలకు వ్యాపిస్తున్నట్లు తెల్చారు. సాధారణంగా దేశవాళిగా లభించే పిల్లి జాతులకన్నా ముద్దుగా, చూడటానికి అందం

Cat Pets : కుక్కల కన్నా పిల్లుల పెంపకమే మేలా.. ఎందుకంటే?..

Cat (1)

Cat Pets : జంతు ప్రేమికులు, ఒంటరి జీవితం గడిపేవారు, చిన్నారులు తమ ఇళ్ళల్లో ఏదో ఒక జంతువును పెంచుకోవాలని వాటితో ప్రేమగా, సరదాగా గడపాలని కోరుకుంటుంటారు. ఎక్కవ మంది తమ ఇళ్ళల్లో కుక్కలను పెంచుకుంటుంటారు. మరికొందరైతే పక్షులను, కుందేళ్ళను ఇతర జాతుల జంతువులను పెంచుతుంటారు. అయితే ఇటీవలికాలంలో చాలా మంది తమ ఇళ్ళల్లో పిల్లులను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే విదేశాలలో చాలా మంది పిల్లులను తమ ఇళ్ళల్లో పెంచుకుంటుండగా, తాజాగా మనదేశంలో కూడా కుక్కల కన్నా పిల్లులను పెంచుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఫెలికాన్ క్లబ్ ఆఫ్ ఇండియా సంస్ధ అంచనా ప్రకారం మన దేశంలో 55లక్షల పెంపుడు పిల్లులు ఉన్నాయట. ఐదేళ్ళ క్రితంతో పోల్చి చూసుకుంటే 100 శాతం అధికంగా ఈ పిల్లులను ఇళ్ళల్లో పెంచుతున్నట్లు నిర్ధారించారు. పిల్లుల పెంపకంలో ముంబై వాసులే ఎక్కవగా ఆసక్తి చూపిస్తున్నట్లు ఆతరువాత స్ధానాల్లో హైద్రాబాద్, బెంగుళూరు ఉన్నట్లు తేల్చారు.

ప్రస్తుతం ఇదే అలవాటు కొలకత్తా, పూణే, ధిల్లీ, నగరాలకు వ్యాపిస్తున్నట్లు తెల్చారు. సాధారణంగా దేశవాళిగా లభించే పిల్లి జాతులకన్నా ముద్దుగా, చూడటానికి అందంగా ఉండే పెర్షియన్, హిమాలయన్, సియామీస్, అమెరికన్ బాబ్ టెయిల్, ఇండియన్ బిల్లి తదితర జాతులను పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

కుక్కల పెంపకం కంటే పిల్లుల పెంపకమే మేలని చాలా మంది బావిస్తున్నారు. పట్టణీకరణ, అపార్టు మెంట్ కల్చర్ లో కుక్కల పెంపకం కొంత ఇబ్బందికరంగా మారింది. కుక్కలు తరచు అరుస్తుండటం, దాని తిండికోసం, వైద్యంకోసం ఎక్కవ మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుండటం, ఇరుగుపొరుగు వారికి ఇబ్బందికరంగా మారటం వంటి వాటితో కుక్కల పెంపకంపై చాలా మంది ఆసక్తి చూపటంలేదు. ఈ క్రమంలో పిల్లుల పెంపకంతో అంతగా ఇబ్బంది పడాల్సి ఉండదని బావిస్తూ వాటి పెంపకంపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుంది.

పిల్లుల పెంపకానికి పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. కొద్ది మొత్తంలో ఆహారాన్ని అందిస్తే సరిపోతుంది. రోజులో మూడువంతులు నిద్రతోనే గడిపేస్తుంటాయి. వీటి జీవితకాలం సైతం 16ఏళ్ళు. ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండటంతోపాటు, ఆరోగ్య పరమైన సమస్యలు పెద్దగా రానందున వీటిని పెంచుకోవటం కూడా సులభమన్న భావనలో చాలా మంది ఉన్నారు. అందుకే కుక్కలకు బదులుగా పిల్లులను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.