Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను స్టోన్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తలకు అప్లైచేయవచ్చు. మెలనిన్ ఉత్పత్తి పెంచుతుంది. హెయిర్ కు మంచి కలర్ వచ్చేలా చేస్తుంది.

Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు

Hair Whitening

Hair Whitening : చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి, పొల్యూషన్, హెరిడిటి, కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ జుట్టు తెల్లబడటానికి కారణమౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్స్ లోపం, స్ట్రెస్, కెమికల్ ప్రొడక్ట్స్ ఇవి కూడా తెల్లజుట్టుకు కారణం. కొత్తగా జుట్టు ఏర్పడే సందర్భంలో హెయిర్ పిగ్మెంట్ తక్కువగా ఉత్పత్తి కావటం వల్ల ఆ ప్రదేశంలో జుట్టు తెల్లగా మారుతుంది. మెలనిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.

విటమిన్ బి12 లోపించడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. కాబట్టి, డైలీ డైట్ లో విటమిన్ బి12 అధికంగా ఉండే పోర్క్, బీఫ్ , ల్యాంబ్, డైరీ ప్రొడక్ట్స్ ను పాలు,చీజ్ గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉండాలంటే, స్మోకింగ్ మానేయాలి. థైరాయిడ్ హార్మోనుల
అసమతుల్యత వల్ల కూడా తెల్ల జుట్టుకు కారణమవుతుంది.

యాంటీఆక్సిడెంట్ వైట్ హెయిర్ తో పోరాడుతుంది. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే బెర్రీస్, గ్రేప్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ టీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. తెల్ల జుట్టును నివారించడంలో హెన్నా బాగా ఉపకరిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెన్నాలో కాఫీ డికాషన్ మిక్స్ చేసి తకలు ప్యాక్ లా వేసుకుని, రెండు మూడు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్, రంగు వస్తుంది.

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను స్టోన్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తలకు అప్లైచేయవచ్చు. మెలనిన్ ఉత్పత్తి పెంచుతుంది. హెయిర్ కు మంచి కలర్ వచ్చేలా చేస్తుంది. కొన్ని ఉసిరికాయ ముక్కలను ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి వేడి
చేయాలి. ఈ ఆయిల్ ను తరచూ తలకు అప్లై చేస్తుంటే తెల్ల జుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది. నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు తగ్గుతుంది.

రెండు టీస్పూన్ల బ్లాక్ టీ ఆకులను నీళ్లలో వేసి ఉడికించి, చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి, ఒక గంట తర్వాత షాంపు లేకుండా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వైట్ హెయిర్ పెరగకుండా నివారిస్తుంది. మెంతులను నానబెట్టిన నీళ్ళు తాగడం, లేదా మెంతి పేస్ట్ ను తలకు ప్యాక్ వేసుకవోడం వల్ల తెల్ల జుట్టును ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. మెంతుల్లో ఉండే న్యూట్రీషియన్స్, విటమిన్ సి , ఐరన్ పొటాషియం మరియు లిసైన్స్ జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది.