Double Face Mask : ఒకే రకమైన రెండు మాస్క్‌లు ధరించొద్దు..కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి డబుల్‌ మాస్క్‌ ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Double Face Mask : ఒకే రకమైన రెండు మాస్క్‌లు ధరించొద్దు..కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

Central Government Guidelines On Wearing A Double Face Mask

Central Government guidelines on mask : కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి డబుల్‌ మాస్క్‌ ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకే రకమైన రెండు మాస్క్‌లను ధరించవద్దని సూచించింది. రెండు మాస్క్‌లలో ఒకటి సర్జికల్‌ మా స్క్‌, మరొకటి వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అలాగే, ఒకే మాస్క్‌ను వరుసగా రెండు రోజులపాటు ధరించవద్దని పేర్కొంది.

కరోనా కట్టడిలో మాస్క్ కీలక పాత్ర
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. కరోనా కట్టడిలో ముఖానికి మాస్క్ ధారణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖానికి రెండు మాస్కులను ధరించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని రెండు రెట్లు మెరుగ్గా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ‘డబుల్‌ మాస్కుల ధారణ’ విషయంలో పాటించాల్సిన నియమాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

రెండు మాస్క్‌లు ఎలా ధరించాలంటే..
డబుల్‌ మాస్క్ ధారణలో భాగంగా ఒకటి సర్జికల్‌ మాస్క్‌, మరొకటి రెండు లేదా మూడు పొరలతో తయారైన మాస్క్‌ను ధరించాలి. ముక్కు మీద బిగుతుగా ఉండేలా మాస్క్‌ ధరించాలి. శ్వాస క్రియకు ఆటంకం కలిగించేలా మాస్క్‌ ఉండకూడదు. వస్త్రంతో కూడిన మాస్క్‌ను తరుచూ ఉతుకుతూ ఉండాలి. డబుల్‌ మాస్క్‌ విషయంలో ఇవి వద్దు.. ఒకే రకమైన రెండు మాస్క్‌లను డబుల్‌ మాస్క్‌గా ధరించవద్దు. ఒకే మాస్క్‌ను వరుసగా రెండు రోజులు వాడొద్దు.

డబుల్‌ మాస్క్‌ సామర్థ్యం ఏమిటంటే?
నాసికా రంద్రాల్లోకి వెళ్లే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను సాధారణ మాస్క్‌తో పోలిస్తే డబుల్‌ మాస్క్‌ రెండు రెట్లు సమర్థంగా అడ్డుకుంటుందని ఓ అధ్యయనం తెలిపింది. సరైన మాస్క్ ధారణ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. ఈ వివరాలు ‘జామా’ ఇంటర్నల్‌ మెడిసన్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.