Skin Beauty : చర్మ సౌందర్యానికి శనగపప్పు

చర్మంపై ముడతలు ఉంటే దానికోసం శనగ పిండి రెండు టేబుల్ స్పూన్లు, పసుపు టీస్పూన్, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని.. వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి.. పావు గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది.అవాంఛిత రోమాలను తొలిగించేందుకు శనగ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Skin Beauty : చర్మ సౌందర్యానికి శనగపప్పు

Chanadal

Skin Beauty : శనగ పప్పు…ప్రతి రోజూ మనం తినే ఆహారంలో శనగ పప్పును.. తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో భాగంగా చేసుకుంటాం. కూరలకు పెట్టే పోపుల్లో, చట్నీల్లో, రోటి పచ్చళ్లలో శనగపప్పును ఉపయోగిస్తాం. అయితే శనగపప్పు ఆరోగ్య పరిరక్షణలో.. సౌందర్య పోషణలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది. శనగ పప్పులో ఎన్నో పోషకాలుంటాయి. అలాగే చర్మ పరిరక్షణకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. శనగ పప్పులోని పోషకాలు చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. అయితే ఈ ప్రయోజనాన్ని పొందాలంటే.. ముందుగా పప్పును బాగా ఎండబెట్టి.. పిండిగా చేయాలి. ఇలా తయారుచేసుకున్న పిండిని మాత్రమే చర్మానికి ఉపయోగించాలి.

జిడ్డుచర్మం కలిగినవారికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు శనగపప్పును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని, దీనికి రెండు టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగు కలిపి.. ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న జిడ్డును తొలిగిస్తుంది.

సూర్యరశ్మి, కాలుష్యం ప్రభావం వల్ల సాధారణంగా శరీరంపై ట్యాన్ పెరిగిపోతుంది. శనగ పప్పులోని గుణాలు చర్మాన్ని డీట్యాన్ చేసి మెరిపిస్తాయి. నాలుగు టీస్పూన్ల శనగ పిండి, టీస్పూన్ నిమ్మరసం, టీస్పూన్ పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు.. మెడ భాగంలో ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. ట్యాన్ సమస్య తొలగిపోతుంది.

ఒక అరటి పండును మెత్తని గుజ్జుగా చేసి.. అందులో తేనె, శనగపిండి మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని చర్మానికి అప్లై చేసి.. పావు గంట పాటు అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి. దీనివల్ల పొడి చర్మంలోనూ.. తేమ పెరిగి చర్మం పట్టులా తయారవుతుంది.శనగ పప్పును ఆహారంలో భాగంగా తీసుకుంటే మొటిమలు నివారించుకోవచ్చు. శనగ పిండిలో నిమ్మరసం, పాల పొడి వేసి.. బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. తర్వాత పావు గంట పాటు.. దానిని అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. మొటిమలతో పాటు మచ్చలు తొలగించుకోవచ్చు.

చర్మంపై ముడతలు ఉంటే దానికోసం శనగ పిండి రెండు టేబుల్ స్పూన్లు, పసుపు టీస్పూన్, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని.. వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి.. పావు గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది.అవాంఛిత రోమాలను తొలిగించేందుకు శనగ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది.

అవాంఛిత రోమాలను తొలిగించేందుకు శనగ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. శనగ పప్పును పిండిగా మార్చి ఆతరువాత దానిని నీటితో కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీనిని ప్యాక్ గా అనవసరపు వెంట్రుకలు ఉన్న చోట వేసుకోవాలి. కొద్ది సేపటి తరువాత ప్యాక్ ను తోలగించి శుభ్రం చేసుకోవాలి.

మీ ముఖం కాంతి వంతంగా మార్చేందుకు శనగపప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు ముందుగా పప్పును పిండిగా మార్చాలి. నాలుగు టీస్పూన్ల శనగ పిండి, టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, కొద్దిగా పాలు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.. 15 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోవాలి. అంతే.. చర్మం మెరిసిపోతుంది.