తలలో పేలను చంపే మందు.. 80 శాతం కరోనా మరణాలను అడ్డుకోగలదంట!

తలలో పేలను చంపే మందు.. 80 శాతం కరోనా మరణాలను అడ్డుకోగలదంట!

Cheap hair lice drug may cut risk of COVID-19 death : తలలో పేలను చంపేందుకు వాడే మందు.. కరోనా మరణాలను తగ్గించగలదు.. ఓ కొత్త అధ్యయనం తేల్చేసింది. కరోనా సోకి ఆస్పత్రి పాలైన బాధితుల ప్రాణాలను రక్షించడంలో పేల మందు (ivermectin) అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనంలో రుజువైంది. దాదాపు 80 శాతం కరోనా మరణాలను ఈ పేల మందు అడ్డుకో గలదంట. దీని ధర కూడా చాలా చౌకేనంట.. ivermectin డ్రగ్ తీసుకున్న 573 మంది కరోనా బాధితుల్లో కేవలం 8 మంది మాత్రమే మరణించారు.

అలాగే ప్లేసిబో డ్రగ్ తీసుకున్న 510 మందితో పోలిస్తే.. వారిలో 44 మంది మరణించారు. ఒక అధ్యయనం ప్రకారం.. పరాన్న జీవులను చంపు మందు (antiparasitic prescription) ధర మార్కెట్లో 17 డాలర్ల నుంచి 43 డాలర్ల వరకు ఉంటుంది. ఒక సింగిల్ డోస్ తీసుకున్న 48 గంటల్లో అన్ని వైరల్ RNA తొలగించినట్టు ఏప్రిల్ అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది.

లివర్‌పూల్ యూనివర్శిటీ వైరాలజిస్ట్ ఆండ్రూ హిల్ కరోనావైరస్ థెరపీ కోసం పరిశోధనలో ఈ కొత్త అధ్యయనానికి ‘transformational’ అని పేరు పెట్టారు. 1,400 మంది కరోనా బాధితుల డేటా ఆధారంగా ఆయన పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించి అధ్యయనాన్ని ఆండ్రూ హిల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించారు.