Cold With Sleep : నిద్రతో జలుబుకు చెక్…

గాఢంగా, చాలినంత సేపు నిద్రవల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. మంచంపై ఎక్కువ సమయం

Cold With Sleep : నిద్రతో జలుబుకు చెక్…

Cold

Cold With Sleep : మనుషులకు వచ్చే సాధారణమైన ఆరోగ్యసమస్యల్లో జలుబు ఒకటి. సంవత్సరానికి సగటున ప్రతి ఒక్కరు రెండు నుంచి నాలుగు సార్లు జలుబు బారిన పడుతుంటారు. అలాగే పిల్లలకు సగటున ఆరు నుంచి ఎనిమిది సార్లు జలుబు చేస్తుంటుంది. చలికాలంలో సర్వసాధారణంగా జలుబు సమస్య వస్తుంది. జలుబు సమస్య ఉన్నసమయంలో ఎక్కవగా రెస్ట్ తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇందులో వాస్తవం ఉందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రశాంతమైన నిద్ర వల్ల సాధారణ జలుబు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. పలు పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైనట్లు చెబుతున్నారు. 21 నుండి 55 సంవత్సరాల ఆరోగ్యవంతమైన స్త్రీ, పురుషలపై జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలను గమనించారు. ఏడు గంటల సమయం కంటే తక్కువ నిద్రపోయిన వారికి ఎనిమిది గంటలకన్నా ఎక్కవ సమయం నిద్రపోయిన వారికంటే జలుబు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికమని కనుగొన్నారు.

గాఢంగా, చాలినంత సేపు నిద్రవల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. మంచంపై ఎక్కువ సమయం పడుకున్నంత మాత్రాన అది నిద్రక్రిందకు రాదని…ఎంత గాఢంగా, ప్రశాంతంగా నిద్రించామన్న దానిని బట్టే మన ఆరోగ్యం అధారపడి ఉంటుంది. పూర్తిస్ధాయి నిద్ర లేమి వల్ల జలుబు వంటి సాధారణ సమస్యలు త్వరగా వ్యాపించే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.

కలత నిద్ర కారణంగా ఇన్ ఫెక్షన్ కారకాలు ఎక్కవగా విడుదల అవుతాయి. ఫలితంగా వైరస్ లు త్వరితగతిన ప్రభావితమౌతాయి. పూర్తిస్ధాయి నిద్్రపోనివారికి జలుబు వచ్చే అవకాశాలు మంచి నిద్రపోయిన వారికంటే ఎక్కవగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా, వైరస్ లబారిన పడకుండా ఉండాలంటే ప్రశాంతంగా నిద్రపోవటం మంచిది.