Chia Seeds : బరువును సులభంగా తగ్గించటంతోపాటు, చర్మసౌందర్యాన్ని పెంచే చియా గింజలు!

చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.

Chia Seeds : బరువును సులభంగా తగ్గించటంతోపాటు, చర్మసౌందర్యాన్ని పెంచే చియా గింజలు!

Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటం కోసం రక రకాల ఆహార పద్దతులను ఎంచుకుంటున్నారు. వాటిలో చియా గింజలు కూడా ఒకటి. చియా గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. చియా గింజలను రోజు తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా అవ్వడమే కాకుండా, మెరిసేలా చేస్తుంది. చియా సీడ్స్ లో విటమిన్ సి , విటమిన్ ఎ ఉండటం వల్ల , ఇది చర్మాన్ని కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది.

చియా విత్తనాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు గ్లూటెన్ ఉండదు. చియా విత్తనాలలో 6 శాతం నీరు, 46 శాతం కార్బోహైడ్రేట్లు, 34 శాతం కొవ్వు మరియు 19 శాతం ప్రోటీన్ ఉంటుంది. 28 గ్రాముల చియా విత్తనాలలో 138 కేలరీలు ఉంటాయి. చియా విత్తనాల్లో ఉన్న ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ప్రోటీనులు ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి చియా విత్తనాలని తినడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాము. దీని వల్ల బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. శాకాహారుల ప్రొటీన్‌ అవసరాలను తీర్చడంలో చియా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.

చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. నీళ్లలో కూడా చియా విత్తనాలు వేసుకుని తాగుతారు. నీటిలో వేసినప్పుడు చియాగింజలు ఉబ్బుతాయి. ఉబ్బి మందపాటి జెల్ గా తయారవుతాయి.

చర్మానికి చియా గింజల వల్ల చియాగింజలను 5 గంటల పాటు నాన బెట్టుకోవాలి. ఆతరువాత వీటిని శుభ్రం చేసుకొని మిక్సీ లో మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో తేనే కొంచం కలుపుకోవాలి. అనంతరం మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 4 లేక 5 నిముషాల పాటు ఉంచుకొని , చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.ఇలా చేయడం వల్ల మీ చర్మం కొన్ని రోజులకు కాంతివంతంగా మారుతుంది.