Heart Health : గుండె ఆరోగ్యానికి గుప్పెడు శనగలు

శనగలు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్ధాయి పెరగటానికి అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి శనగలు ఎంతగానో మేలు చేస్తాయి.

Heart Health : గుండె ఆరోగ్యానికి గుప్పెడు శనగలు

Chick Peas

Heart Health : తెలుగు వారి వంటకాల్లో శనగలు ఒక బాగం. శనగల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రొటీన్లు, పీచుపదార్ధాన్ని కలిగి ఉంటాయి. మాంసాహారం తినలేని వారు శనగలను తీసుకుంటే మాంసాహారంలో లభించే పోషకాలన్నీ వీటి నుండి పొందవచ్చు. శనగల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నాటురకం శనగలు, కాబూలి శనగలు. వీటిని ఉడకబెట్టుకుని ఆహారంగా తీసుకోవాలి. కొంతమంది పులుసు కూరల్లో శనగలను వినియోగిస్తుంటారు.

100 గ్రాముల శనగల్లో 9గ్రాముల ప్రొటీన్, 8గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో కొలెస్ట్రాల్ అసలు ఉండదు. ఐరన్, మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి. శనగలు తినటం వల్ల కడుపు నిండిన బావన కలుగుతుంది. త్వరగా ఆకలివేయదు. బరువు తగ్గాలనుకునే వారికి శనగలు చక్కని ఆహారం. డైట్ చేసేవారితోపాటు వర్కప్స్ చేసేవారు ఆహారంగా శనగలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

డయాబెటీస్ తో బాధపడేవారు శనగలు తీసుకోవటం మంచిది. ఎక్కువ పీచుపదార్ధం కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్ధాయిలు నియంత్రించేందుకు దోహదపడతాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకుల పటుత్వాన్ని పెంచేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ బి9 మెదడు, కండరాలు, నాడీ వ్యవస్ధ చక్కగా పనిచేయటంతోపాటు, కాలేయం  పనితీరు మెరుగవుతుంది.

శనగలు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్ధాయి పెరగటానికి అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి శనగలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను మీ దరి చేరకుండా చూసుకోవచ్చు. రాత్రి పూట ఒక కప్పు లేదంటే 50 గ్రాముల శనగలను నీళ్ళలో నానబెట్టి ఉదయం సమయంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.  గుండె ఆరోగ్యానికి ప్రతిరోజు గుప్పెడు శనగలు తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రక్త హీనత సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కప్పు ఉడకబెట్టిన శనగలను తినటం వల్ల స్వల్ప కాలంలోనే శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. శనగలు రోజు తినేవారు స్ధూలకాయం బారిన పడటం అరుదు. ఇదే విషయం పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. రోజు శనగలు తినలేని వారు వారానికి ఒక్కరోజైనా శనగలు తినటం మంచిది.

శనగల్లో పీచు పదర్ధాం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరంఅవుతాయి. జీర్ణ వ్యవస్ధ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరగటం వల్ల జ్వరం, వళ్ళునొప్పులు వంటి చిన్నచిన్న సమస్యలు దరిచేరవు. శరీరం మొత్తానికి బలాన్నిచ్చే శనగలను తినటం మాత్రం మర్చిపోకండి. పూర్వం దేవాలయాల వద్ద ప్రసాదంగా ఉడకబెట్టిన శనగలను పెట్టేవారు. అందులో ఉండే పోషక విలువల నేపధ్యంలోనే అనాటి తరం శనగలను ప్రసాదంగా అందించేవారు.