Chicken : జలుబుతోపాటు అనేక ఆరోగ్య సమస్యలకు కోడిమాంసం బెస్ట్!

కోడి రొమ్ము భాగం, కాలేయంలో విటమిన్ బి2 అధికంగా ఉంటుంది. కోడి మాంసం తినటం వల్ల శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. కణాజాల పెరుగుదలతోపాటు మరమత్తులను సమర్ధవంతంగా ప్రోత్సహించటంలో కోడి మాంసం సహాయపడుతుంది.

Chicken : జలుబుతోపాటు అనేక ఆరోగ్య సమస్యలకు కోడిమాంసం బెస్ట్!

Chicken Is The Best

Chicken : పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్న మాంసాహారాలలో కోడి మాంసం ప్రధానమైనది. ఆరోగ్యానికి కోడి మాంసం ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కోడి మాంసంలో పిండిపదార్ధాలు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, బి12, విటమిన్ ఇ, కె, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ , సోడియం, వంటి అనేక పోషకాలు ఉన్నాయి. జలుబు, ముక్కు దిబ్బడ తో బాధపడే వారు ఆసమయంలో కోడి మాంసంతో తయారు చేసిన సూప్, పులుసు వంటివాటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరగటంతోపాటు సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

పెద్ద వయస్సు వారిలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బోలు ఎముకల వ్యాధికి దారి తీయకుండా ఉండాలంటే భాస్వరం అధికంగా ఉండే చికెన్ ను ఆహారంలో తగినమొత్తంలో చేర్చుకోవటం మంచిది. దంతాల ఆరోగ్యానికి , దంత క్షయం నివారించటంలో ఇది ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు చికెన్ వంటి మాంసకృత్తులు కలిగిన ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ఎర్రటి మాంసానికి బదులు చికెన్ తీసుకోవటం వల్ల చక్కెర వ్యాధి నిర్వాహణలో దోహదపడుతుందని పలు అధ్యయనాల్లో సైతం తేలింది.

కోడి మాంసంలో ఉండే మాంసకృత్తులు కడుపు నిండిన బావన కలిగిస్తాయి. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. అయితే చికెన్ ను అయిల్ తో వేపుకుని తినటం వంటివి చేయకుండా ఉడికించటం, గ్రిల్లింగ్ చేయటం వంటి పద్దతులను అనుసరించి ఆహారంగా తీసుకోవటం శ్రేయస్కరం. క్యాన్సర్ కు విరుద్ధంగా ప్రభావంతంగా పనిచేయటంలో కోడి మాంసం ఉపకరిస్తుందని పరిశోధనల్లో తేలింది. దీనిపై ఇంకా మరికొన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. కోడి మాంసంలో ఉండే పలు విటమిన్లు రక్త కణాల ఉత్పత్తికి సహాయపడటంతోపాటు రక్త హీనత లోపాన్ని నివారిస్తాయి.

కోడి రొమ్ము భాగం, కాలేయంలో విటమిన్ బి2 అధికంగా ఉంటుంది. కోడి మాంసం తినటం వల్ల శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. కణాజాల పెరుగుదలతోపాటు మరమత్తులను సమర్ధవంతంగా ప్రోత్సహించటంలో కోడి మాంసం సహాయపడుతుంది. జుట్టు, గోర్లకు అవసరమైన విటమిన్ ఇ చికెన్ తీసుకోవటం ద్వారా అందుతుంది. జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు. అయితే కోడి మాంసాన్ని రోజు వారిగా కాకుండా వారానికో, 15 రోజులకో తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే కోడి మాంసం అధికంగా తీసుకోవటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల హృదయ సంబంధమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.