Obesity : ఇంటికే పరిమితమైన పిల్లలు… పెరిగిన ఊబాకాయం సమస్యలు

చిన్నారుల్లో ఊబకాయ సమస్యకుగల కారణాల విషయానికి వస్తే ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవటం, హై కాలరీస్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవటం, శారీరక శ్రమ సరిగా లేకపోవటం, జంక్ ఫుడ్ తీసుకోవటం,

Obesity  : ఇంటికే పరిమితమైన పిల్లలు… పెరిగిన ఊబాకాయం సమస్యలు

Obesitey

Obesity : కరోనాతో చిన్నారులు ఇంటికే పరిమితమై పోయారు. ఎలాంటి శారీరక వ్యాయామం లేకపోవటం, జీవనశైలి, ఆహారపు అలావాట్లలో మార్పులు వెరసి చిన్నారుల్లో ఊబకాయం రోజు రోజుకు పెరిగి పోతుంది. సాధారణంగా ఊబకాయ సమస్యలు రావటానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, దీని వల్ల 80 శాతం మంది ఉబకాయ సమస్యతో బాదపడుతుండగా, మరో 20శాతం మంది జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా ఊబకాయం సమస్య తలెత్తుతుంది.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభానికి ముందు వరకు 10 నుండి 13శాతం పిల్లల్లో మాత్రమే ఊబకాయం సమస్య ఉండేది. అయితే కరోనా తరువాత లౌక్ డౌన్ పరిణామాలు, స్కూల్స్ లేకపోవటంతో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఊబకాయ సమస్య 16శాతానికి చేరింది. ఆరోగ్య సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రోజు వారి స్కూల్స్ ఉన్న సమయంలో చిన్నారుల్లో రోజు వారి ఆటపాటలతో గడిపేవారు. స్కూల్ లో అటు ఇటు తిరగటం వంటి ఎదో ఒక యాక్టివిటీ ఉండేది. అయితే ప్రస్తుతం ఇంటి వద్దే ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఒకేచోట కూర్చుని ఉండటం. శారీరక వ్యాయామానికి దూరం కావటంతో వారిలో ఊబకాయం సమస్య పెరిగింది.

కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ కనబరుస్తున్నారు. అలాంటి వారు తమ పిల్లలతో ప్రతిరోజు వ్యాయామాలు చేయించటం, సాయంత్రం సమయంలో ఆటలు అడించటం వంటివి చేయిస్తున్నారు. జంక్ ఫుడ్ ల జోలికి వెళ్ళనీయకుండా పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తులు పాటిస్తున్నారు. అయితే కొంత మంది తల్లిదండ్రులకు అవగాహన లోపం కారణంగా పిల్లల ఫిజికల్ యాక్టివిటీపై పెద్దగా దృష్టిసారించటం లేదు. దీంతో అలాంటి చిన్నారులు బరువెక్కి, ఒబేసిటీ సమస్యలతో బాధపడుతున్నారు.

ఇంటి వద్దే ఉంటున్న పిల్లలకు ఆహారం తీసుకోవటంలో నియంత్రణ లేకుండా పోయింది. ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవటం, స్నాక్స్ వంటి వాటిని పదేపదే తినటం, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు వంటి వాటిని తీసుకోవటం కూడా ఊబకాయ సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్ధితి భవిష్యత్తులో చిన్నారులకు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశాలు ఉంటాయి.

చిన్నారుల్లో ఊబకాయ సమస్యకుగల కారణాల విషయానికి వస్తే ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవటం, హై కాలరీస్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవటం, శారీరక శ్రమ సరిగా లేకపోవటం, జంక్ ఫుడ్ తీసుకోవటం, శరీరంలో కదలికలకు సంబంధించిన ఎక్స్ ర్ సైజులు లేకపోవటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. దీనివల్ల పిల్లల్లో బీపీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీనికితోడు చిన్న వయస్సులోనే వారు షుగర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఒబేసిటీ వల్ల చిన్నారుల్లో ఎకాన్ థోసిస్ ఏర్పాడి భవిష్యత్తులో అనేక రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంటుంది.

ఊబకాయం వంటి సమస్యల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందే. పిల్లల చేత తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం , వాకింగ్, ఇతర క్రీడలను ఆడించటం వంటివి చేయిస్తుండాలి. బాగా చెమట పట్టే క్రీడల వల్ల చిన్నారుల్లో చురుకుదనం పెరగటంతోపాటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమౌతాయి. ఎక్కువ శాతం సంప్రదాయక ఆహారమైన పండ్లు, పండ్ల రసాలు, ఆకు కూరలు వంటి శాఖా ఆహారాన్ని మాత్రమే పిల్లకు అందించటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల పిల్లలను ఊబకాయం సమస్యనుండి కాపాడుకోవచ్చు.