Black Fungus Fears : బ్లాక్ ఫంగస్ భయం.. ఇంట్లో ఫ్రిజ్‌ శుభ్రం చేస్తున్నారా? ఉల్లిపాయలపై అదే ఫంగస్.. ఇందులో నిజమెంత?

కరోనావైరస్ సోకిన రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయాలు వణకుపుట్టిస్తున్నాయి.

Black Fungus Fears : బ్లాక్ ఫంగస్ భయం.. ఇంట్లో ఫ్రిజ్‌ శుభ్రం చేస్తున్నారా? ఉల్లిపాయలపై అదే ఫంగస్.. ఇందులో నిజమెంత?

Clean Fridge On Onions Black Fungus Fears Myths Or Fact

Black Fungus Fears : కరోనావైరస్ సోకిన రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయాలు వణకుపుట్టిస్తున్నాయి. కరోనా వచ్చినవారిలోనే కాదు.. ఇంట్లో వాడే ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ బ్లాక్ ఫంగస్ విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ లో ఈ బ్లాక్ ఫంగస్ ఉంటుందని, అలాగే ఉల్లిపాయల్లోని పైపోరలో కూడా నల్లటి రంగు పొర ఉంటుంది.. ఇదే అసలైన బ్లాక్ ఫంగస్ అనే ఆందోళన కనిపిస్తోంది.

రిఫ్రిజిరేటర్ లో లోపల రబ్బరుపై కనిపించే బ్లాక్ ఫిల్మ్ కూడా మ్యూకోమైకోసిస్‌ వ్యాధి కారణమయ్యే బ్లాక్ ఫంగస్ అంటున్నారు. ఉల్లిపాయలు కొనే సమయాల్లో వాటిపై నల్లపోరను గమనించే ఉంటారు. అదే నల్ల ఫంగస్ అంటూ భయాందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత.. కరోనా బాధితుల్లో వచ్చే బ్లాక్ ఫంగస్ కు ఇంట్లో పెరిగే ఈ బ్లాక్ ఫంగస్ కు తేడా ఏంటి? ఇంట్లో ఉండే ఈ బ్లాక్ ఫంగస్.. రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసిన ఆహార పదార్థాల ద్వారా మీ శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుంది.

మ్యూకోమైకోసిస్‌కు కారణమయ్యే అతి భయంకరమైన బ్లాక్ ఫంగస్ కూరగయాలపై చేరుతుందని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ లోపల నల్ల అచ్చు పడిన చోట ఫంగస్ చేరుతుందని, అలాగే ఉల్లిపాయలపై నల్ల పొర ఏర్పడుతుంది. ఇది మ్యూకోమైకోసిస్‌కు కారణమయ్యే ఫంగస్‌కు భిన్నంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంట్లో పెరిగే బ్లాక్ ఫంగస్ కు.. కరోనా బాధితుల్లో వ్యాపించే బ్లాక్ ఫంగస్ కు సంబంధం లేదని గుర్తించారు. అది.. ఇది ఒక్కటే అనేది అపోహ మాత్రమేనని వాస్తవం కాదని తేలింది.

COVID-19 మహమ్మారి మధ్య దేశవ్యాప్తంగా 200 మందికి పైగా బ్లాక్ ఫంగస్ మరణాలు నమోదయ్యాయి. మ్యుకార్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్‌ను ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద గుర్తించదగిన వ్యాధిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ వ్యాధి ఎక్కువగా COVID-19 రోగులలో దీర్ఘకాలిక అనారోగ్యం, మరణాలకు దారితీస్తుందని పేర్కొంది.

ఎక్కువ కాలం స్టెరాయిడ్లు వాడినా లేదా డయాబెటిస్ ఉంటే ఆ వ్యక్తిలో అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందులో ఒకటి సాధారణంగా కనిపించే మ్యూకోమైకోసిస్…ప్రధానంగా సైనసెస్, కన్ను. కొన్ని సమయాల్లో మెదడులోకి వెళ్లి తిష్టవేస్తుంది. పల్మనరీ మ్యూకోమైకోసిస్ అధిక ప్రమాదం కలిగిన వ్యక్తుల్లో చక్కెర నియంత్రణపై జాగ్రత్త ఉండాలి. స్టెరాయిడ్ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్టెరాయిడ్ల వాడకం బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాప్తికి దారితీస్తుందని తేలింది.