CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!

లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!

Cloves

CLOVES : సుగంధ ధ్రవ్యాల్లో లవంగం కూడా ఒకటి. ప్రతి ఇంటి వంటల్లో లవంగాలను ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి లవంగాలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాస్మోటిక్స్, ఆయుర్వేద మందుల తయారీలో లవంగాలతోపాటు, లవంగ తైలాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన వంటి వాటిని పోగొట్టటంలో లవంగాలు దోహదపడతాయి. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోపాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్‌, ఆర్త్థ్రెటిస్‌, అల్జీమర్స్‌ను నిరోధించటంలో బాగా ఉపకరిస్తాయి.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది హై బీపీ సమస్యతో బాదపడుతున్నారు. ఈ రక్తపోటుకు నివారణకు లవంగం చక్కటి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు,మూడు లవంగాలను నమలడం వల్ల రక్తపోటు తగ్గుతుందట. వంటకాల్లో వాడడం వల్ల వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. జీర్ణ క్రియ శక్తిని పెంచటంలో సహాయపడుతుంది.

లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట ఉంచితే నొప్పి తగ్గుతుంది. లవంగనూనెలో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను పెంచటంలో ఉపకరిస్తాయి. శరీరంలోని చక్కర స్థాయిని తగ్గించే గుణాలతో పాటు, పురుషుల్లో ఉండే శీఘ్రస్ఖలన సమస్యలకు లవంగం మంచి పరిష్కారం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

అయితే లవంగాలు తీసుకోవటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. లవంగంలో ఉండే యుగనెల్ అనే రసాయనం శరీరంలోని రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. అందుకే రక్త స్రావం ఉన్నవారు, శస్త్రచికిత్స చేసుకునేవారు లవంగంకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లవంగంతో తయారు చేసిన సిగరెట్లు తాగడం మూలంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. లవంగం నూనె అధికంగా తీసుకుంటే కాలేయం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. గ్లూకోస్ స్థాయిని తగ్గించే గుణం వల్ల మధుమేహులకు కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.