ఫ్రిడ్జ్‌లలో పెరుగుతున్న బ్యాక్టీరియా… సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

ఫ్రిడ్జ్‌లలో పెరుగుతున్న బ్యాక్టీరియా… సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

Fridge Bacteria: సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్‌ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్‌ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.

* ఫ్రిజ్‌లో ఫుడ్ ఐటమ్స్ పెట్టేముందు అది హైజిన్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటన్నిటినీ వేర్వేరుగానూ, హానికరం వ్యాప్తి కాని ప్యాకింగ్‌ మెటీరియల్‌తో ప్యాక్‌ చేసి పెట్టుకోవాలి.
* మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్‌ లాంటి మాంసాన్ని (రా–మీట్‌ను) ఒకేదానిలో ఉంచుకోకూడదు. దేనికదే విడివిడిగా ప్యాక్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలపకుండా ఉంచుకోవాలి.
* ఫ్రిజ్‌లో నుంచి తీసిన ఆహార పదార్థాలను యథావిధిగా తినడం కంటే ఉడికించుకోవడమో, నూనెలో వేయించడమో ఏదో ఒకటి చేసి తినడమే మేలు. ఆకుకూరలూ, కాయగూరలు అయితే కచ్చితంగా తగిన ఉష్ణోగ్రత దగ్గర ఉడికిన తర్వాతే తినాలి.
* ఇలా మాంసాహారాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల సాల్మొనెల్లా లేదా ఈ–కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక మాత్రమే తినాలి.
* డీప్‌ ఫ్రీజర్‌ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప… బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్‌) కావడం లేదని అర్థం.
* అలా ఫ్రిజ్‌లో చల్లదనం/ఉష్ణోగ్రత లేకపోతే పనితీరు బాగాలేదని గమనించి.. ఫ్రిజ్‌ రిపేర్‌ చేయించుకోవాలి.
* ప్రతి ఒక్కరూ ఫ్రిజ్‌ను నెలకు లేదా రెండు నెలలకొకసారైనా నిర్ణీత సమయంలో క్లీన్ చేసుకుంటూ ఉండాలి.