Induction Stove : గ్యాస్ ధర పెరగటంతో ఇండక్షన్ స్టవ్ పై వంటచేస్తున్నారా! అయితే జాగ్రత్త

ఇండక్షన్ స్టవ్ ను ఎక్స్ టెన్సన్ బాక్కులకు కనెక్ట్ చేయటం వంటివి చేయకూడదు. నీళ్లతో కడగటం వంటివి చేయరాదు. తడితగలకుండా మెత్తని పొడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి.

Induction Stove : గ్యాస్ ధర పెరగటంతో ఇండక్షన్ స్టవ్ పై వంటచేస్తున్నారా! అయితే జాగ్రత్త

Induction Stove

Induction Stove : గ్యాస్ ధరలు పెరిగిపోవటంతో చాలా మంది విద్యుత్ ఉపకరణాలతో వంటలు వండేస్తున్నారు. గ్యాస్ తో పోలిస్తే సమయం కూడా అదాఅవుతుండటం, వేగంగా వంట పూర్తవుతుండటంతో గృహిణులకు ఇవి కొంత సౌకర్యవంతంగా మారాయి. ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్ వినియోగం బాగా పెరిగింది. ప్రతి ఇంట్లో చాలా మంది గ్యాస్ పోయ్యిలను అవసరమైన వాటికోసం మాత్రమే ఉపయోగిస్తూ ఎక్కువగా ఇండక్షన్ స్టవ్ లను వంటలు వండేందుకు వాడుతున్నారు. అయితే చాలా మందికి వీటి వాడకం విషయంలో సరైన అవగాహన లేకపోవటం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు పాటించక పోవటం వల్ల త్వరగా అవి పాడైపోతున్నాయి.

అలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించటం మంచిది. ఇండక్షన్ స్టవ్ పైన కేవలం స్టీలు, ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. విద్యుత్ తో పనిచేసేది కాబట్టి నీటికి కాస్త దూరంగా ఉంచటం మంచిది. తడిగా ఉన్న నేలపై స్టవ్ ను ఉంచి వండకూడదు. మెటల్ టేబుల్ మీద పెట్టకుండా చెక్క టేబుల్ పై పెట్టుకోవాలి. మెటల్ వస్తులు, కాగితాలు, బట్టలకు దగ్గరగా ఇండక్షన్ తో వంట చేయరాదు. రేడియో, టీవి, కంప్యూటర్ల వంటి వాటికి దూరంలో ఉంచాలి. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ అయస్కాంత ప్రభావం వల్ల ఆ పరికరాలు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.

ఇండక్షన్ స్టవ్ ను ఎక్స్ టెన్సన్ బాక్కులకు కనెక్ట్ చేయటం వంటివి చేయకూడదు. నీళ్లతో కడగటం వంటివి చేయరాదు. తడితగలకుండా మెత్తని పొడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. పొరపాటున ఇండక్షన్ స్టవ్ పై చిన్నపాటి పగుళ్ళు కనిపించినా అలాంటి దానిని వాడకపోవటమే మంచిది. వంట పూర్తయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకుని , ప్లగ్ డిస్ కనెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల ఇండక్షన్ స్టవ్ ఎక్కువ కాలం మన్నిగా ఉండటంతోపాటు, ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకోవచ్చు.