Coriander : శరీరంలో కొవ్వులను కరిగించే కొత్తిమీర

ఇక ఒక గ్లాసు మజ్జిగలో కాస్త కొత్తిమీర రసం, కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే ఎముకల దృఢత్వంతోపాటు, చర్మం సౌందర్యవంతంగా ఉంటుంది.

Coriander : శరీరంలో కొవ్వులను కరిగించే కొత్తిమీర

Coriander

Coriander : కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసం కూరలలో వినియోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఇంట్లోనే కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. కొత్తిమీర ఆహారంలో చేర్చటం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఉండే అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. వీటి ద్వారా లభించే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

రోజూ కొత్తిమీర తినడం వల్ల అధిక రక్తపోటును, చెడు కొవ్వును తగ్గించి గుండె పనితీరు మెరుగు పరుగుస్తుంది. అంతేకాదు ఈ కొత్తిమీర జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కొత్తిమీర లో ఉండే డోడిసేనల్ అనే పదార్థం ద్వారా పేగుల్లో ఏర్పడే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ లనుతగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

కొత్తిమీరలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్నిఅదుపుచేస్తుంది. కొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో అరగడానికి దోహదపడే జీర్ణపరమైన జ్యూసులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కొత్తిమీర లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

ఇక ఒక గ్లాసు మజ్జిగలో కాస్త కొత్తిమీర రసం, కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే ఎముకల దృఢత్వంతోపాటు, చర్మం సౌందర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారిలో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరిగే వారికి కొత్తిమీర కషాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఆ సమస్య పోతుంది. గర్భిణీలు రోజు రెండు లేదా మూడు చెంచాల కొత్తిమీర రసం నిమ్మరసం తో కలిపి తీసుకుంటే ఉదరసంబంధిత సమస్యలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన , చిగుళ్ళ సమస్యలు ఉన్నవారు కొత్తిమీరు ఆకులను కొద్దిమొత్తంలో ప్రతిరోజు ఉదయం తీసుకోవటం ద్వారా సమస్యపోతుంది.

అలాగే అజీర్ణంతో బాధపడే వారు కూడా కొత్తిమీర రసంలో నిమ్మరసం జీలకర్ర కాస్త ఉప్పు కలుపుకుని తీసుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే గ్యాస్ వల్ల వచ్చే మంట ను పోగొట్టాలంటే పెరుగులో కాస్త కొత్తిమీర రసం కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగితే ఆ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఈ కొత్తిమీర రసానికి శరీరంలో ఉండే కొవ్వును కరిగించే లక్షణాలు చాలా ఉన్నాయి. చెడుకొవ్వులతో బాధపడేవారు రోజు తమ ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవటం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.