ముద్దుతోనే కరోనా వ్యాప్తి.. శృంగారం ద్వారా సోకదు.. పురుషుల వీర్యంలో వైరస్ ఉండదు.. సైంటిస్టుల క్లారిటీ

10TV Telugu News

కరోనా వైరస్ (కొవిడ్-19) శృంగారం ద్వారా వ్యాప్తిచెందు.. లైంగిక చర్యలో ముద్దులు పెట్టుకోవడం ద్వారానే కరోనా వైరస్ సోకుతుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికా, చైనా సైంటిస్టుల లేటెస్ట్ రీసెర్చ్‌లోనూ ఇదే తేలింది. కరోనా వ్యాప్తి సమయంలో శృంగారం చేస్తే వైరస్ సోకుతుందని చాలామంది బ్రిటన్లు నమ్ముతున్నారు. కానీ, కొత్త అధ్యయనంలో సెక్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. Utah Health యూనివర్శిటీకి చెందిన రీసెర్చర్లు దీనికి సంబంధించి కొత్త ఆధారాలను గుర్తించారు. కరోనా సోకిన పురుషుల్లోని వీర్యంలో ఇప్పటివరకూ వైరస్ కనిపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. 

పరిశోధక బృందంలో అధ్యయనం చేసిన సహా పరిశోధకులు Dr James Hotaling చెప్పిన ప్రకారం.. వాస్తవానికి ఈ చిన్నపాటి ప్రాథమిక అధ్యయనంలో పురుషుల వీర్యంలో లేదా వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్ తరహాలో కొవిడ్-19 కారక SARS-కోవ్-2 కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతున్న ఆందోళనలు నెలకొన్నాయి. దాంతో పరిశోధకులు దీనిపై పరిశోధన చేశారు. చైనాలో 34 మంది కరోనా బాధితుల వీర్యం శాంపిల్స్ విశ్లేషించారు. వీరి వీర్యంలో ఎక్కడా కూడా వైరస్ అనవాళ్లు కనిపించలేదు.

Kissing

వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా కరోనా వైరస్ ప్రవేశించలేదని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు నిర్ణయించారు. ఒకవేళ కొవిడ్-19 వైరస్ శృంగారం ద్వారా సోకే అవకాశం ఉంటే.. అది పురుషుడికి దీర్ఘకాలికమైన తీవ్ర సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే జన్యుపరమైన విశ్లేషణలో శాంపిల్స్  ద్వారా వైరస్ వృషణ కణాలపై దాడి చేయడం చాలా అరుదు అని తేలింది.  

ఈ పరిశోధనలతో COVID-19 తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు వైరస్ సోకుతుంది అనడంలో నిజం లేదని పరిశోధకులు గుర్తించారు. డాక్టర్ హోటలింగ్ చెప్పిన ప్రకారం.. “COVID-19తో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఎక్కువ వైరల్ లోడ్ ఉండవచ్చు. ఇది వీర్యం బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేమన్నారు. ఈ అధ్యయనంలో కరోనా నుంచి నెమ్మదిగా కోలుకునేవారిలో చాలామందిలో శృంగారం చేయడం ద్వారా వైరస్ సోకినట్టు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదన్నారు. ఈ అంశంపై స్పష్టత కోసం సైంటిస్టులు.. ఆరోగ్యవంతులైన యువకులకు చెందిన ఏకైక కణం.. MRNA నుంచి సేకరించిన మునుపటి డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ MRNA వీలు కల్పిస్తుంది. 
sprem

అందులో కొవిడ్-19తో ముడిపడిన ACE-2, TMPRSS2 జన్యువులపై పరిశోధకులు ఫోకస్ పెట్టారు. వీటి ద్వారానే కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశానికి వీలుకల్పిస్తాయని గుర్తు చేశారు. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే కరోనా వైరస్ సమర్థంగా ప్రవేశించే అవకాశం ఉంది. 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్ చొరబడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. మరోవైపు కరోనా వైరస్ శృంగారం ద్వారా వ్యాప్తి చెందదని, కేవలం ముద్దులు ద్వారానే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని రుజువైంది. 

Zava UKలకు చెందిన యూకే ఆధారిత డాక్టర్ Dr Simran Deo మిర్రర్ ఆన్ లైన్‌తో మాట్లాడుతూ.. బ్రిటన్లు సాధ్యమైనంతవరకు ముద్దులు పెట్టుకోవడం, ఆహారం, డ్రింక్స్ షేరింగ్ చేసుకోవడానికి దూరంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ నీళ్లు లేదా ముక్కు, నోటిలోని తెమడ నీటి తుంపర్ల నుంచి వ్యాప్తి చెందుతుందని ఆమె వివరణ ఇచ్చారు. అందుకే ముద్దులు పెట్టుకోవడం, కరచాలనం చేయడం, ఆహారం, డ్రింక్స్ ఇతరులతో షేరింగ్ చేసుకోవడం చేసేవారిలోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.