కరోనా లక్షణాల్లో ఆరు వేర్వేరు గ్రూపుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!

  • Published By: sreehari ,Published On : July 17, 2020 / 10:38 PM IST
కరోనా లక్షణాల్లో ఆరు వేర్వేరు గ్రూపుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల్లో విభిన్న రకాల గ్రూపులు ఉన్నాయంట.. ఓ కొత్త అధ్యయనం ఇదే చెబుతోంది. ఏయే గ్రూపులో ఎలాంటి లక్షణాలు ఉంటాయో పరిశోధకులు తేల్చేశారు. సాధారణంగా కోవిడ్ -19 లక్షణాలు ఆరు వేర్వేరు గ్రూపుల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ లక్షణాలను బట్టి కరోనా సోకిన వ్యక్తికి ఎలాంటి వైద్య సాయం అవసరమో నిర్ధారించడానికి సాయపడుతుందని అంటున్నారు.

కరోనా బాధితుడికి వెంటిలేటర్ లేదా ఇతర శ్వాస పరమైన సపోర్ట్ అవసరమా లేదో నిర్ధారించవచ్చునని తెలిపారు. ఈ పరిశోధనల్లో రెస్పిరేటరీ ముందస్తు హెచ్చరికను ముందుగానే హెల్త్ కేర్ ప్రొవైడర్లు గుర్తించవచ్చునని బృందం పేర్కొంది. కానీ తీవ్రమైన అనారోగ్యానికి గురైనవారికి సాయపడుతుందని చెబుతున్నారు.

ఆక్సిజన్ మీటర్ లేదా నర్సు విజిట్ వంటి ఇంటి వద్దే వైద్యం అందించడానికి వీలుంటుంది. తద్వారా అనారోగ్య తీవ్రతను తొందరగా గుర్తించవచ్చు. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం.. కోవిడ్ -19 సోకిన రోగులను ఆస్పత్రికి వెళ్లేందుకు చెకప్ సగటు సమయం 13 రోజులుగా నిర్ణయించారు. ఆస్పత్రికి పడకల కొరత కూడా తగ్గుతుందని లండన్ కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు.

ఈ అధ్యయనాన్ని MedRxivలో ప్రచురించారు. కోవిడ్ -19కు పాజిటివ్ పరీక్షించిన 1,653 మంది వినియోగదారులను నుంచి పరిశోధకులు డేటాను సేకరించారు. రోగుల లక్షణాలను గుర్తించారు. వారి ఆరోగ్యం పరిస్థితిని క్రమం తప్పకుండా పరీక్షించారు. మొత్తంమీద, వీరిలో 383 మంది ఒక ఆస్పత్రికి వెళ్లారు. 107 మందికి అదనపు ఆక్సిజన్ లేదా వెంటిలేషన్ అవసరమని గుర్తించారు.

కరోనా సోకిన బాధితుల్లో గుర్తించిన లక్షణాల ఆధారంగా మొదటి 14 రోజులలోపు ఆరు వేర్వేరు గ్రూపులను సూచిస్తాయని తేల్చేశారు. శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నవారిలో ఈ గ్రూపుల మధ్య లక్షణాలను గుర్తించినట్టు డాక్టర్ క్లైర్ స్టీవ్స్ అన్నారు. ఇందులో వయస్సుతో పాటు అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలను కూడా ఈ గ్రూపులలో ఎక్కువగా కనిపించాయని పరిశోధక బృందం నివేదించింది.

కరోనా లక్షణాల్లో.. ఆరు గ్రూపులు లేదా క్లస్టర్లు :
క్లస్టర్ 1: శ్వాసనాళం పైభాగంలో శ్వాసకోశ లక్షణాలు, నిరంతర దగ్గు, కండరాల నొప్పి కూడా ఉంటాయి. ఈ గ్రూపులో సుమారు 1.5శాతం మంది రోగులకు శ్వాసకోశ సాయం అవసరమని గుర్తించారు. 16శాతం మంది ఆస్పత్రికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. ఈ తరహా లక్షణాలు 462 మంది వరకు ప్రభావితం చేసే గ్రూపుగా నివేదించారు.

క్లస్టర్ 2: శ్వాసనాళం పైభాగంలో శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తాయి.. వేళకు భోజనం చేయకపోవడం, జ్వరం తీవ్రతను సూచిస్తాయి. ఈ గ్రూపులోని రోగులలో 4.4శాతం మందికి రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. 17.5శాతం మంది ఆస్పత్రికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది.

క్లస్టర్ 3: డయేరియా వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొన్ని ఇతర లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఈ గ్రూపులో కేవలం 3.7శాతం మంది రోగులకు మాత్రమే శ్వాసకోశ సాయం అవసరం అవుతుంది. దాదాపు 24శాతం మంది ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది.

క్లస్టర్ 4: తీవ్రమైన అలసట, నిరంతర ఛాతీ నొప్పి, దగ్గు ప్రారంభ సంకేతాలుగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గ్రూపులోని రోగులలో 8.6శాతం మందికి శ్వాసకోశ సపోర్ట్ అవసరం ఉంటుంది. 23.6శాతం మంది ఆస్పత్రికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వెళ్లాల్సి ఉంటుంది.

క్లస్టర్ 5: గందరగోళం, భోజనం మానేయడం, తీవ్రమైన అలసట కనిపిస్తాయి. ఈ గ్రూపులోని రోగులలో 9.9శాతం మందికి బ్రీతింగ్ సపోర్ట్ అవసరం పడుతుంది. 24.6శాతం మంది ఆస్పత్రికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా వెళ్లాల్సి రావొచ్చు.

క్లస్టర్ 6: శ్వాసకోశ, ఛాతీ నొప్పి ప్రారంభంలో కనిపించవచ్చు. గందరగోళం, అలసట, జీర్ణశయాంతర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రూపులో 20శాతం మందికి వెంటిలేటర్ అవసరం పడొచ్చు.. 45.5శాతం మంది ఆస్పత్రికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వెళ్లారు. 167 మందిపై ఎఫెక్ట్ చేయగల అతి తక్కువ సాధారణ లక్షణంగా చెప్పవచ్చు.

ఇందులో మొదటి రెండు గ్రూపుల్లో కోవిడ్ -19 తేలికపాటి లక్షణాలుగా కనిపిస్తున్నాయని బృందం తెలిపింది. 1,047 వేర్వేరు యాప్ నుంచి డేటాతో పరిశోధకులు పరీక్షించారు. తలనొప్పి, వాసన, రుచిని కోల్పోవటం వంటి అన్ని గ్రూపుల్లోనూ ఇలాంటి గ్రూపుల లక్షణాలు కూడా ఉన్నాయని గుర్తించారు.

రెండోది మాత్రం అతి తక్కువ సందర్భాల్లో ఎక్కువ కాలం ఉంటుందని గుర్తించామని పరిశోధకులు అంటున్నారు. కరోనా సోకిన వారిలో లక్షణాలను యాప్ ద్వారా రికార్డు చేస్తే… ఆస్పత్రికి అవసరం ఎవరికి ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చనని చెప్పారు.

గుర్తించిన లక్షణాల మొదటి ఐదు రోజుల ఆధారంగా, వయస్సు, లింగంతో పాటు ముందుగా ఉన్న అనారోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రోగి లక్షణాలను బట్టి వెంటిలేటర్ అవసరమా లేదా 79శాతం అంచనా వేయొచ్చునని బృందం పేర్కొంది.