Covid-19: పెదవులు, గోర్లు, చర్మంపై కరోనా లక్షణాలు.. డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిందే!

కరోనావైరస్ మూడో వేవ్ రెండో వేవ్ అంత ప్రమాదకరంగా లేదు కానీ, కేసులు మాత్రం విపరీతంగా వెలుగులోకి వచ్చాయి.

Covid-19: పెదవులు, గోర్లు, చర్మంపై కరోనా లక్షణాలు.. డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిందే!

Corona Virus

Covid-19: కరోనావైరస్ మూడో వేవ్ రెండో వేవ్ అంత ప్రమాదకరంగా లేదు కానీ, కేసులు మాత్రం విపరీతంగా వెలుగులోకి వచ్చాయి. కొత్త వేరియంట్, ఓమిక్రాన్ వీర విహారం చేసెయ్యగా.. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి కేసులు. ఒమిక్రాన్ చాలా వేగంగా ప్రజల్లోకి వచ్చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో కరోనా కేసులను నివారించడానికి, లక్షణాలు ఉంటే టెస్టింగ్‌తో అవసరం లేకుండా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని కోరుతున్నారు నిపుణులు.

కోవిడ్ వ్యాధి ప్రధాన లక్షణాలు ముక్కు కారటం, తలనొప్పి, అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, వారి ఆరోగ్య స్థితిని బట్టి ఈ లక్షణాలు ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మారుతూ ఉంటాయి. అయితే కోవిడ్‌-19 లక్షణాలు ఏవీ తేలిగ్గా తీసుకోకూడదు. కరోనావైరస్‌కు సంబంధించిన మరికొన్ని ఇతర లక్షణాల గురించి కూడా నిపుణులు వివరిస్తున్నారు.

కరోనా వచ్చినప్పుడు ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయే అవకాశం ఉండగా.. ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినప్పుడు ముఖ్యంగా గోర్లు, పెదవుల్లో మార్పులు కనిపిస్తాయి. చర్మం, పెదవులు, గోళ్ల రంగులో మార్పుకు సైనోసిస్ కారణం కాగా.. సైనోసిస్ సాధారణంగా ఆక్సిజన్ లేకపోవడం వల్ల వస్తుంది, కాబట్టి మీ చర్మం, గోళ్ల రంగులో ఏదైనా మార్పు కనిపిస్తే, వెంటనే డాక్టరుని సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే కూడా ఆసుపత్రిలో చేరడం అవసరం. కోవిడ్-19 ఇతర లక్షణాలు లేకపోయినప్పటికీ, మీరు మీ ఆక్సిజన్ స్థాయి తగ్గితే మాత్రం డాక్టర్ దగ్గరకు కచ్చితంగా వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.