క్లైమాక్స్‌లో కరోనా వ్యాక్సిన్‌లు: ఈ టీకాలు పనిచేస్తాయా? మనకు వరకు వస్తాయా? ఈ నాలుగింటిలో ఏమైనా కావచ్చు. మీరు సిద్ధమేనా?

  • Published By: sreehari ,Published On : August 16, 2020 / 02:07 PM IST
క్లైమాక్స్‌లో కరోనా వ్యాక్సిన్‌లు: ఈ టీకాలు పనిచేస్తాయా? మనకు వరకు వస్తాయా? ఈ నాలుగింటిలో ఏమైనా కావచ్చు. మీరు సిద్ధమేనా?

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 20.7 మిలియన్లకుపైగా కరోనావైరస్ కేసులు, 7,51,000 మరణాలు నమోదయ్యాయి. చైనాలోని వుహాన్‌లో కరోనా‌వైరస్ ఉద్భవించి 8 నెలలకుపైగా అయ్యింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 213 దేశాలకు వ్యాపించింది.



కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, శాస్త్రవేత్తల వేగవంతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి, క్లినికల్ ట్రయల్స్ వివిధ దశలలో 160 మందికి పైగా టీకా వేయగా.. 27 మంది హ్యుమన్ ట్రయల్స్ చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూసేవారంతా ఈ నాలుగింటి విషయంలో పరిస్థితులకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజలు సిద్ధమేనా?:
Oxford-AstraZeneca కరోనావైరస్ వ్యాక్సిన్‌తో సహా 7 వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. 50 శాతం కంటే తక్కువ అమెరికన్లు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ భద్రత గురించి సాధారణ ప్రజలకు చాలా ఎక్కువ భరోసా ఇస్తుందని గణాంకాలు చూపిస్తున్నాయి. వ్యాక్సిన్ల భద్రతా ప్రమాదాల గురించి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.



వైరస్ మ్యూటేట్ అవుతోంది.. టీకాలు పనిచేయవు :
కరోనావైరస్ కనీసం 6 జాతులు ఉన్నాయి, కానీ, రోజురోజుకు వైరస్ మ్యుటేట్ అవుతోంది. ‘ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ’ ప్రకారం.. ఈ పరిశోధనలో SARS-CoV-2 జన్యుక్రమంలో మార్పులు చెందుతున్నట్టు గుర్తించారు సైంటిస్టులు.. వైరస్ మరింత మ్యుటేట్ అయితే మాత్రం టీకాలు పనిచేయవు.

టీకాతో రోగనిరోధక శక్తి ఉండకపోవచ్చు :
కరోనావైరస్ వ్యతిరేకంగా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయడంలో టీకా వైఫల్యం కావొచ్చుననే ఆందోళన కలిగిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం.. COVID ప్రాణాలతో ఉన్న కరోనావైరస్ యాంటీబాడీస్ స్థాయిలు కేవలం మూడు నెలల వ్యవధిలో బాగా పడిపోయాయి. ఈ పరిశోధన ఆమోదించిన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రోగనిరోధక శక్తి వ్యవధి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమంటున్నారు.



టీకా పంపిణీతో సవాలు :
కోవిడ్ టీకాను పరిమిత సమయం కంటే ముందుగానే వాడుకలోకి తీసుకొచ్చేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి విషయంలో ఇప్పటికే పలు ట్రయల్స్ విజయవంతం కాగా.. పంపిణీ చేయడం సవాల్‌గా మారింది. విజయవంతమైన వ్యాక్సిన్ పంపిణీ సగం పని మాత్రమే. 2020 చివరినాటికి లేదా 2021 ప్రారంభంలో టీకా తీసుకుంటే పంపిణీ, మాస్-ఇమ్యునైజేషన్ పెద్ద సవాలుగా మారబోతున్నాయి. బిలియన్ల వ్యాక్సిన్ మోతాదుల తయారీ, పంపిణీ చాలా కష్టమైన పనిగా రుజువు అవుతుంది ప్రపంచ జనాభాలో కనీసం 70 శాతం మందికి హెర్డ్ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి టీకాలు వేయాల్సి ఉంటుంది.