Covid-19 Vaccine : ఆ తర్వాతే శరీరంలో వ్యాక్సిన్‌ పనిచేస్తుందట!

వ్యాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌ సోకుతుందంటే.. అవి పనిచేయడం లేదా? వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నా ఇన్ని కేసులు నమోదవుతుంటే ఇప్పుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి..

Covid-19 Vaccine : ఆ తర్వాతే శరీరంలో వ్యాక్సిన్‌ పనిచేస్తుందట!

Coronavirus Vaccine Will Work Only After 45days Of Vaccination

Coronavirus Vaccine will work after 45days : వ్యాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌ సోకుతుందంటే.. అవి పనిచేయడం లేదా? వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నా ఇన్ని కేసులు నమోదవుతుంటే ఇప్పుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి.. అసలు వ్యాక్సిన్‌ ఎలా పనిచేస్తోంది.. వ్యాక్సిన్‌ వేసుకున్నా వైరస్‌ సోకడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.. విన్నారుగా.. ఇండియాలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఎఫిషియన్సి అదీ.. ప్రపంచంలో ఏ దేశం కూడా వైరస్‌ను వందశాతం అడ్డుకునే వ్యాక్సిన్‌ను ఇంకా అభివృద్ధి చేయలేదు.. అంటే వ్యాక్సిన్‌ తీసుకున్న అందరిలో ఇది సమర్థంగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికి.. పూర్తిగా లేదనే చెప్పాలి..

అంతేకాదు.. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కూడా ఉన్నపళంగా కరోనాకు యాంటీ డోసులు శరీరంలో ఉత్పత్తి కావు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెండు డోస్‌లుగా ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నారు.. అంటే రెండు డోస్‌లు తీసుకున్న 14 రోజుల తర్వాత మాత్రమే వ్యాక్సిన్‌ పనిచేయడం ప్రారంభమవుతోంది.. తొలి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. అంటే మొదటి డోస్‌ వేశాక 28 రోజుల తర్వాత మరోసారి మరో డోస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 28 రోజులూ ఆ తర్వాతవి 14 రోజులు కలుపుకుని మొత్తం 42 రోజుల తర్వాతే వ్యాక్సిన్‌ ప్రభావం శరీరంలో కనిపిస్తుంది అన్నమాట… అప్పుడు మాత్రమే శరీరంలో పూర్తి స్థాయిలో కరోనాకు యాంటిబాడీస్‌ వృద్ధి చెందుతాయి.

ఇక సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ కోవీషీల్డ్‌ విషయంలో ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటుంది.. ఇటీవల కేంద్రం రెండో డోస్‌ వ్యవధిని 4 నుంచి 8 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. దీంతో కోవాగ్జిన్‌ తీసుకున్న వారిలో 70 రోజుల తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇక శరీరంలోని యాంటీ బాడీలు కూడా అందరిలో ఒకేలా ఉండవు. ఇవి వేర్వేరు కాలాల్లో క్షీణిస్తాయని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో వైద్య నిపుణులు తెలుసుకున్నారు.

కొంతమంది వ్యక్తుల్లో కేవలం రోజుల వ్యవధిలోనే ఇవి తగ్గిపోతే.. మరి కొంత మందిలో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతాయంటున్నారు. ఇలా మనిషిని బట్టి కూడా యాంటీబాడీల వృద్ధిలో తేడాలు ఉంటాయి. ఈ విషయాలు తెలుసుకోకుండా చాలామంది వ్యాక్సినేషన్‌ తొలి డోస్‌ తీసుకోగానే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మాస్క్‌లు వదిలేస్తున్నారు.. సోషల్‌ డిస్టేన్స్‌ మర్చిపోతున్నారు.. దీంతో మళ్లీ వైరస్‌ విజృంభిస్తోంది. కోవిడ్‌ను నియంత్రించాలంటే.. టీకా తీసుకున్న తర్వాత కూడా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచించారు.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వైరస్‌ మళ్లీ సోకుతుందని.. బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరిస్తున్నారు..