Cough : చలికాలంలో బాధించే దగ్గు సమస్య

దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు గొంతులో గరగర సమస్య నుండి ఉపశమనం కోసం పిప్పర్ మెంట్లు, మెంథాల్ వంటి వాటిని చప్పరించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Cough : చలికాలంలో బాధించే దగ్గు సమస్య

Cough

Cough : చలికాలంలో వచ్చే సమస్యల్లో దగ్గు, జలుబు, జ్వరం ప్రధానమైనవి. ఎలర్జీ, ఆస్తమా, పొడి వాతావరణం ఇలా అనేక అంశాలు ముఖ్యంగా దగ్గు వంటి సమస్యకు కారణమౌతాయి. దగ్గు తగ్గించుకునేందుకు ఔషదాలను వాడుకుంటూనే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో శరీరం మొత్తం నిర్జలీకరణకు గురవుతుంది. ఇందుకోసం తగినంత నీటిని శరీరానికి అందించటం ముఖ్యం. తరచుగా నీటిని తాగటం అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల గొంతు తడిఆరకుండా ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొడి దగ్గు తగ్గేందుకు వేడి నీరు సహాయపడుతుంది.

దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు గొంతులో గరగర సమస్య నుండి ఉపశమనం కోసం పిప్పర్ మెంట్లు, మెంథాల్ వంటి వాటిని చప్పరించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గొంతు కఫాన్ని, ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి తేనె బాగా ఉపకరిస్తుంది. దగ్గు తో బాధపడుతున్న వారు కొద్ది మొత్తంలో తేనె తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. వేడి నీటితో స్నానం చేయటం వల్ల జలుబు , దగ్గు వంటి సమస్యలు చలికాలంలో దరి చేరకుండా చూసుకోవచ్చు. చలికాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. దీని వల్ల దగ్గు సమస్య అధికమౌతుంది. రోజుకు ఒకసారి ఆవిరి పట్టటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

దగ్గు వచ్చే సమయంలో గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించాలి. అలాగే పసుపు, మిరియాలు కలిపిన పాలు తాగటం వల్ల దగ్గు త్వరగా తగ్గుతుంది. తేనె మరియు అల్లం నుండి తీసిన రసాన్ని సమన మొత్తాలలో కలపాలి. ఒకవేళ దీని రుచి నచ్చని ఎడల, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో ఈ మిశ్రమాన్ని కలిపి తాగటం వలన దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. రోజు ఈ మిశ్రమాన్ని తాగటం ద్వారా ముక్కు, గొంతు భాగాలలో విశ్రాంతి లభిస్తుంది.