Cough Sound: దగ్గిన శబ్ధాన్ని బట్టి జబ్బేంటో చెప్పేసే యాప్

దగ్గితే రోగమేంటో చెప్పేసే యాప్ రెడీ అవుతుంది. శబ్దాన్ని బట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామో చెప్పేస్తుందని నిపుణులు అంటున్నారు.

Cough Sound: దగ్గిన శబ్ధాన్ని బట్టి జబ్బేంటో చెప్పేసే యాప్

Cough Sound

Cough Sound: దగ్గితే రోగమేంటో చెప్పేసే యాప్ రెడీ అవుతుంది. శబ్దాన్ని బట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామో చెప్పేస్తుందని నిపుణులు అంటున్నారు. అమెరికన్ కంపెనీ Hifi Inc ఈ యాప్ డెవలప్మెంట్ చేసింది. వివిధ రకాల వ్యాధుల కారణంగా వచ్చే మిలియన్ల కొద్దీ దగ్గు వాయిస్‌లను చేర్చారు. అలా ఖచ్చితమైన ఫలితాలు అందేలా చేయగలిగాయి. రోగికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో చెప్పేస్తుంది.

భవిష్యత్‌లో న్యుమోనియా, ఉబ్బసం, కరోనా వంటి వ్యాధులు సోకితే.. ఆ వ్యక్తికి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్తున్నారు రీసెర్చర్లు. బ్రీతింగ్ సిస్టమ్‌లో సమస్య వచ్చినప్పుడు దగ్గు సాధారణంగా వస్తుంది. శరీరంలోని నరాలు మెదడుకు సందేశాలను పంపుతాయి. మెదడు కండరాలకు తిరిగి సంకేతాన్ని పంపి, ఊపిరితిత్తుల్లో గాలిని నింపడం ద్వారా ఛాతీ, పొత్తికడుపును ఉబ్బరం చేయమని సూచిస్తుంది. ఇలా జరిగినప్పుడు దగ్గు వచ్చి ఉపశమనం పొందుతాం.

 

Read More: Virat Kohli Steps Down: కెప్టెన్‌గా తప్పుకుంటా.. -విరాట్ కోహ్లీ

‘దగ్గు శబ్దం కూడా వ్యాధులను బట్టి మారుతుంటుంది. ఆస్తమాతో బాధపడుతున్న వారి శ్వాస, దగ్గులో ఒక రకమైన ఊపిరి ఉంటుంది. న్యుమోనియాతో బాధపడే రోగుల ఊపిరితిత్తుల నుంచి మరో రకమైన ధ్వని వస్తుంది. ఈ యాప్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వివిధ దగ్గు శబ్దాల శాంపుల్స్‌ను అర్థం చేసుకుంటుంది. వాటిని వినడం ద్వారా మనుషులు సాధారణంగా అర్థం చేసుకోని వ్యాధుల గురించి యాప్ తెలియజేస్తుంది’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్, టీబీ నిపుణుడు డాక్టర్ పీటర్ స్మాల్ వెల్లడించారు.

దీనిని మరింతగా డెవలప్ చేసే పనిలో ఉన్నామని.. ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పెయిన్‌లో రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు చెబుతున్నారు.