అదేపనిగా ఇలా వెక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చు.. జాగ్రత్త!

అదేపనిగా ఇలా వెక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చు.. జాగ్రత్త!

Hiccups Be a Sign of the New Coronavirus : అదేపనిగా వెక్కిళ్లు వస్తున్నాయా? వెక్కిళ్లు ఆగడం లేదా? అయినా అనుమానించాల్సిందే.. అది కరోనా కొత్త లక్షణం కావొచ్చు. ఎందుకైనా మంచిది ఓసారి టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు వైద్య నిపుణులు. మార్చి 2020లో కరోనాను అధికారికంగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). COVID-19 ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసింది.

చాలామంది కరోనా బాధితుల్లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో వెక్కిళ్లు అరుదుగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కిళ్ళు వస్తే కరోనా సోకినట్టేనా? అది కొత్త కరోనావైరస్ సంకేతం కాదా అనేది పరీక్షించుకోవాల్సి ఉంటుంది. తరచుగా ఎక్కిళ్ళు వస్తే.. మీ వైద్యుడిని తప్పక సంప్రదించాలని అంటున్నారు నిపుణుల.

ఓ కొత్త పరిశోధన ప్రకారం. ఎక్కిళ్ళు COVID-19 అరుదైన సంకేతం కావొచ్చునని తేలింది. 2020 అధ్యయనంలో, 64 ఏళ్ల వ్యక్తికి COVID-19 ఏకైక లక్షణంగా నిరంతర ఎక్కిళ్లు వచ్చాయని గుర్తించారు.

నిరంతరాయంగా 72 గంటలు ఎక్కిళ్లు వచ్చిన ఓ పేషెంట్ క్లినిక్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతడిలో రక్త పరీక్ష, ఊపిరితిత్తుల ఇమేజింగ్ రెండూ జరిగాయి. ఊపిరితిత్తుల్లో తక్కువ తెల్ల రక్త కణాలతో పాటు రెండింటిలోనూ కరోనా వైరస్‌కు సంబంధించిన ఆధారాలను నిర్ధారించారు.

వెంటనే అతడికి COVID-19 టెస్టు చేయగా.. పాజిటివ్ అని తేలింది. 62 ఏళ్ల వ్యక్తి కూడా కొత్త కరోనావైరస్ లక్షణంగా ఎక్కిళ్లను అనుభవించినట్లు కనుగొన్నారు. అధ్యయనాలు కేవలం రెండు వ్యక్తిగత కేస్ స్టడీస్ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు.

దీర్ఘకాలిక ఎక్కిళ్ళు కొత్త కరోనావైరస్ మధ్య సంబంధాన్ని గుర్తించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మందికి ఎక్కిళ్లు వచ్చినా వాటింతట అవే తగ్గిపోతాయి.

కానీ, దీర్ఘకాలికంగా మారితే మాత్రం ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు. మీకు ఎక్కిళ్లు 48 గంటల కంటే ఎక్కువసేపు ఉంటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.. ఎందుకంటే అంతర్లీన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావొచ్చు. ప్రతి ఒక్కరూ COVID-19 కోసం టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ, CDC పరీక్షించు కోవచ్చునని సూచిస్తున్నారు.