IPHONE 14: ట్రావెలింగ్ అంటే ఇష్టమా.. ఐఫోన్ 14 ధరలోనే దేశాలు చుట్టి రావొచ్చని తెలుసా?

ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్టెట్‌లో ఏదైనా దేశం వెళ్లొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఐఫోన్ 14 కొనే డబ్బులతోనే కొన్ని దేశాలు తిరిగి రావొచ్చు. అదే ఫోన్ ధరతోనే ఈ దేశాలు సందర్శించి రావొచ్చు. అలాంటి కొన్ని దేశాలివి.

IPHONE 14: ట్రావెలింగ్ అంటే ఇష్టమా.. ఐఫోన్ 14 ధరలోనే దేశాలు చుట్టి రావొచ్చని తెలుసా?

IPHONE 14: యాపిల్ ఫోన్ అంటే చాలా మందికి క్రేజ్. ఐఫోన్లు చాలా ఖరీదైనా సరే… కొనేస్తుంటారు. అయితే, ఐఫోన్ కొనేందుకు అవసరమైన డబ్బుతో కనీసం ఆరుకుపైగా దేశాలు చుట్టిరావొచ్చనే సంగతి తెలుసా? ఔను! తాజాగా మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 14 ధరతో ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగిరావొచ్చు. మన కరెన్సీలో ఐఫోన్ 14 ప్రారంభ మోడల్ ధర రూ.80,000 వరకు ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా రూ.1,39,900 ఉండొచ్చు. అయితే, ఈ ధరలోనే కొన్ని దేశాలు వెళ్లొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ట్రావెలింగ్ ఇష్టమైతే ఐ ఫోన్ కోసం పెట్టే డబ్బులతో వాటిలో ఏదైనా దేశం వెళ్లి రావొచ్చు. అదో స్వీట్ మెమరీగా నిలిచిపోతుంది. మరి ఐఫోన్ 14 కొనే ధరలోనే వెళ్లి రాగలిగే దేశాలేంటో చూద్దామా..!

Father kills son: దుబాయ్ నుంచి వచ్చిన కొడుకును చంపిన తండ్రి.. కారణమేంటంటే
వియత్నాం
ఆసియా దేశాల్లో ఒకటైన వియత్నాం పర్యాటకంగానూ ఆకట్టుకుంటుంది. ప్రకృతి సహజ సంపద, ప్రాచీన మఠాలు అక్కడి ప్రత్యేకతలు. టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే దేశం. అక్కడికెళ్తే విభిన్న టీ రుచులు ఆస్వాదించవచ్చు. అలాగే వాటర్ యాక్టివిటీస్ ఇష్టపడేవారికి వియత్నాం చాలా మంచి ప్లేస్. సగటున రూ.80,000 ఉంటే వియత్నాం వెళ్లి రావొచ్చు.
దక్షిణ కొరియా
ఎక్కువగా పర్యాటకుల్ని ఆకర్షించకపోయినప్పటికీ అద్భుతమైన ప్రాకృతిక ప్రదేశాలు, సాంస్కృతిక, వారసత్వ సంపద దక్షిణ కొరియా సొంతం. నేషనల్ పార్కులు, అందమైన దీవులు, బీచ్‌లతోపాటు అనేక ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. హైకింగ్ చేసే వారికి అనుకూలమైన ప్రదేశాలున్నాయి. రూ.80,000లోనే దక్షిణ కొరియా కూడా వెళ్లి రావొచ్చు.

thailand
థాయ్‌లాండ్
అత్యంత ప్రముఖ ప్రపంచ పర్యాటక దేశాల్లో థాయ్‌లాండ్ తప్పనిసరిగా ఉంటుంది. ఆసియాలోనే అత్యంత అందమైన బీచ్‌లు ఇక్కడ ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్ని, దీవుల్ని, వాటర్ యాక్టివిటీస్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ డెస్టినేషన్. ఈ దేశాన్ని కూడా ఐఫోన్ 14 ధర అయిన రూ.80,000లోనే సందర్శించవచ్చు.
సింగపూర్
ఇది అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే బడ్టెట్‌లోనే ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా ఐఫోన్ 14 ధరలోనే సింగపూర్ వెళ్లి రావొచ్చు. నేచర్ లవర్స్‌కు, ఫుడీస్‌కు సింగపూర్ ప్యారడైజ్ లాంటిది. ఇక్కడ ఏడాదంతా బోలెడన్ని నేషనల్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి.

Viral Video: సఫారి జీప్‌ను వెంటాడిన ఏనుగు.. తప్పించుకున్న టూరిస్టులు.. వీడియో వైరల్
ఇండోనేసియా
ప్రపంచంలోనే అత్యంత సుందరమైన బీచుల్లో ఒకటైన బాలి ఇండోనేసియాలోనే ఉంది. బీచులు, తీర ప్రాంతాల్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఐఫోన్ 14 ధరలోనే ఈ దేశం వెళ్లి రావొచ్చు. అనేక ద్వీపాలు, వాటర్ యాక్టివిటీస్, అరుదైన జీవజాలం వంటివి ఇండోనేసియా ప్రత్యేకతలు.
శ్రీలంక
భారత దేశానికి అత్యంత దగ్గరగా ఉన్న శ్రీలంక పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఐఫోన్ 14 ధరతోనే ఈ దేశం కూడా వెళ్లి రావొచ్చు. అక్కడి కరెన్సీతో పోలిస్తే మన కరెన్సీ చాలా ఎక్కువ. అందుకే తక్కువ ఖర్చుతోనే అక్కడ మంచి ఫుడ్, అకామడేషన్ వంటివి ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అనేక బీచులు, ప్రాకృతిక ప్రదేశాలు ఇక్కడి సొంతం.