కరోనా వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేవు. అయినా, మీ గుండెను గట్టిదెబ్బ దెబ్బతీయగలదు….

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 01:08 PM IST
కరోనా వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేవు. అయినా, మీ గుండెను గట్టిదెబ్బ దెబ్బతీయగలదు….

COVID-19 can cause long-term damage to heart: కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడో పోయిందో కూడా గుర్తించలేని పరిస్థితి.. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు.. వారికి కరోనా సోకిందా? లేదా అనేది బయటపడటం లేదు.. కరోనా లక్షణాలు లేవు కదా? సేఫ్ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. మీకు తెలియకుండానే కరోనా వైరస్ మీ శరీరంలోని ఒక్కో అవయవాన్ని దెబ్బతీస్తుంది.. అది ఏ అవయంపై దాడి చేస్తుందో కచ్చితంగా చెప్పలేం.. సాధారణంగా కరోనా సోకి లక్షణాలు లేనివారి గుండెను వైరస్ గట్టి దెబ్బ తీస్తుందనడంలో సందేహం అక్కర్లేదు..



శరీరంలో తిష్టవేసి..గుండెను దెబ్బతీస్తుంది :
ఇండియానా యూనివర్శిటీకి చెందిన కొందరు పరిశోధకులు కరోనా లక్షణాలు కనిపించనివారిపై అధ్యయనం చేశారు.. ఇందులో కరోనా మహమ్మారి వారి శరీరంలో తిష్ట వేసి గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుందని గుర్తించారు. ESPN ప్రకారం.. పవర్ ఫైవ్ కాన్ఫరెన్స్ స్కూళ్లలో డజనుకు పైగా అథ్లెట్లు కరోనావైరస్ బారినపడ్డారని, వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వారిలో myocardial injury అయిందని గుర్తించారు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన అన్నీ స్పోర్ట్స్ ఈవెంట్లన్నీ వచ్చే ఏడాది 2021 వరకు వాయిదా పడ్డాయి. మయోకార్డిటిస్ కారణంగా గుండెలో కండరాల వాపు ఉంటుందని కరోనా బాధితుడు, బేస్ బాల్ క్రీడాకారుడు ఎడ్వర్డో రోడ్రిగెజ్ తెలిపాడు. myocardial కారణంగా గుండె కొట్టుకునే తీరు మారిపోతుంది.. అంటే హృదయ స్పందనలో మార్పులు వస్తాయి.. ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం జరుగుతుంది. ఫలితంగా మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.



11 ఏళ్ల పిల్లలలోనూ కరోనా వైరస్ కణాలను గుర్తించారు.. కరోనాతో మరణించిన ఆరుగురి గుండెలోని కండరాలలో వైరల్ ప్రోటీన్ ఉండటాన్ని గుర్తించామని చెప్పారు. ఊపిరితిత్తులు వైఫల్యం చెందడంతోనే వీరంతా మరణించారని తమ పరిశోధనలో రీసెచ్చర్లు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలోనూ myocardial సమస్య అధికంగా కనిపిస్తోందని హెచ్చరిస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న నాలుగు వారాల తర్వాత వారిలో మయోకార్డిటిస్ డెవలప్ అయిందని గుర్తించారు. గుండె కండారాలు వాపుకు దారితీసిందని చెప్పారు. ఈ సమస్య జీవితాంతం ఉండే అవకాశం ఉందని, ఎప్పుడు గుండె లయ తప్పుతుందో చెప్పడం కష్టమని.. అదేగాని జరిగితే గుండె ఆగి మరణం సంభవించవచ్చునని పరిశోధకులు తెలిపారు. అసలు కరోనాతో శరీరంలో myocardial అనారోగ్య సమస్య ఉందని నిర్ధారించవచ్చు..



మయోకార్డిటిస్ ఉన్న రోగులు తరచుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.. ఛాతి నొప్పి, జ్వరం, అలసట వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటాయి. మరికొంతమందికి మాత్రం అసలు లక్షణాలే కనిపించవు. కొంతమందిలో 104 డిగ్రీల జ్వరం, ఛాతి పట్టేసినట్టు అనిపించడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం.. COVID-19 నుంచి 7 శాతం మరణాలు myocardial వల్లే ఎక్కువగా జరుగుతుంటాయని పేర్కొన్నాయి.



COVID-19 రోగులు వైరస్ వ్యాపించిన కొన్ని నెలల తర్వాత మయో కార్డియల్ సంకేతాలు కనిపిస్తాయని అనేక అధ్యయనాల్లోనూ తేలింది. కరోనా నుంచి కోలుకున్న 139 మందిలో 10 వారాల తరువాత వారిలో 37 శాతం మందికి మయోకార్డిటిస్ లేదా మయోపెరికార్డిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వారిలో సగం కంటే తక్కువ మంది లక్షణాలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.