COVID-19 టెంపరేచర్ చెకింగ్‌.. డేంజర్ అంటున్న సైంటిస్టులు!

  • Published By: sreehari ,Published On : July 22, 2020 / 04:02 PM IST
COVID-19 టెంపరేచర్ చెకింగ్‌.. డేంజర్ అంటున్న సైంటిస్టులు!

కరోనా కాలంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా బాడీ టెంపరేచర్ చెకింగ్ చేయడం సాధరణమై పోయింది. ప్రతిచోట బాడీ టెంపరేచర్ చెకింగ్ చేసి లోపలికి అనుమతినిస్తున్నారు. స్థానిక జిమ్ ల నుంచి డిస్నీ ల్యాండ్ వరకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల టెంపరేచర్ చెకింగ్స్ చేస్తున్నారు. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే వారిని లోపలికి అనుమతించడం లేదు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వ్యాపారాల్లో ప్రతిరోజూ ఉద్యోగుల ఉష్ణోగ్రతను చెకింగ్ చేయవచ్చని సిఫార్సు చేసింది.  కానీ శాస్త్రవేత్తలు ఈ విషయంలో హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిఒక్కరిని చెకింగ్ చేయడం ద్వారా COVID-19 వ్యాప్తికి కారణమవుతుందని సూచిస్తున్నారు.

కరోనా వ్యాప్తిని నిరోధించలేదనడానికి ఎలాంటి డేటా లేదని స్క్రిప్స్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ టోపోల్ చెప్పారు. టెంపరేచర్ చెకింగ్‌తో ఫలితం ఉండదని అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించడానికి వీలుగా ఇలా టెంపరేచర్లను చెకింగ్ చేసేందుకు వీటిని వాడుతున్నారు.

2000లో SARS మహమ్మారి సమయంలో దీన్ని అమల్లోకి తెచ్చారు. SARS వ్యాధి సోకిన వారిలో కనీసం 86 శాతంలో జ్వరం వచ్చినట్టు హెలెన్ బ్రాన్స్వెల్ స్టాట్ నివేదించారు. ప్రస్తుత డేటా ప్రకారం COVID-19 ఉన్నవారిలో సగం కంటే తక్కువ మందికి ఎప్పుడూ జ్వరం వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వారిలో లక్షణాలు కనిపించి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి ముందే ఇతరులకు అంటిస్తారని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వైరస్ లక్షణాలు లేని వ్యక్తుల నుంచే వైరస్‌కు ఇతరులకు ఎక్కువగా గురయ్యేవారు ఉంటారని చెబుతోంది. అందులో 65 ఏళ్లు రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లోనే ఎక్కువ మంది ఉంటారు. యువతలో అనారోగ్య లక్షణాలు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది.

అనేక ఇతర అనారోగ్యాల కారణంగా కూడా జ్వరం వస్తుందనేది గుర్తించాలని అంటున్నారు. పదేపదే టెంపరేచర్ చెకింగ్ చేయడం ద్వారా పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు. మంచి కంటే హాని జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.