Covid-19 Third Wave : ఈ అక్టోబర్‌లోనే కొవిడ్ థర్డ్ వేవ్? అయినా దేశం సమర్థంగా ఎదుర్కోగలదు!

భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, వచ్చే అక్టోబర్ నెలలో భారత్‌లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఇండియాకు ఉందని రాయిటర్స్ సంస్థ అంచనా వేస్తోంది.

Covid-19 Third Wave : ఈ అక్టోబర్‌లోనే కొవిడ్ థర్డ్ వేవ్? అయినా దేశం సమర్థంగా ఎదుర్కోగలదు!

Covid 19 Third Wave Likely To Hit India By October Month, Will Be Better Controlled

Covid-19 Third Wave : భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, వచ్చే అక్టోబర్ నెలలో భారత్‌లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఇండియాకు ఉందని రాయిటర్స్ సంస్థ అంచనా వేస్తోంది. కరోనా మొదటి, రెండు వేవ్ ల కంటే సమర్థవంతంగా థర్డ్ వేవ్‌ను ఇండియా కంట్రోల్ చేయగలదని అంటోంది. రాబోయే ప్రజారోగ్య ముప్పును ముందుగానే పసిగట్టి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 40 మంది వైద్య రంగ నిపుణులు, ఎపిడమాలజిస్టులు, ప్రొఫెసర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టుల నుంచి కరోనాపై అభిప్రాయాలను రాయిటర్స్ సేకరించింది. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్‌ వరకు కేసులు ఎలా పెరిగి తగ్గాయో మొత్తం డేటాను సేకరించింది. అన్నింటినీ కలిపి రెండింటి ప్రభావం ఆధారంగా థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేదానిపై రాయిటర్స్ అంచనాలు రెడీ చేసింది. భారత్‌లో అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ రావడం ఖాయమంటోంది. అయితే.. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే.. థర్డ్ వేవ్‌ను ప్రధాని మోదీ సర్కార్ సమర్థంగా ఎదుర్కొంటుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. మరో ఏడాది వరకు ప్రజారోగ్యానికి కరోనా సవాల్‌గానే నిలుస్తుందని తెలిపింది.

జూన్‌ 3 నుంచి 17 మధ్య 40 మంది నిపుణుల అభిప్రాయాలను రాయిటర్స్ సేకరించింది. వారిలో 85శాతం మందికి పైగా అక్టోబర్‌లో థర్డ్‌ వేవ్‌ రావడం తథ్యమని స్పష్టం చేశారు. మరో ముగ్గురు శాస్త్రవేత్తలు ఆగస్టులో వస్తుందని అంచనా వేశారు. మరో 12 మంది పరిశోధకులు సెప్టెంబర్‌లో వస్తుందని అంచనా వేశారు. మిగిలిన వారు నవంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య కరోనా మళ్లీ విజృంభించే ముప్పు ఉందని అన్నారు. 70శాతం మంది నిపుణులు మాత్రం.. దేశంలో కరోనా థర్డ్ వేవ్‌ను భారత్‌ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు.

కరోనా థర్డ్ వేవ్‌తో పిల్లలకి ముప్పు ఉంటుందా? అంటే.. 40 మంది నిపుణుల్లో 26 మంది ముప్పు పొంచి ఉందని చెప్పారు. కానీ, మరో 14 మంది మాత్రం అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు. మరో ఏడాది పాటు కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి ఉంటుందని రాయిటర్స్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ని గతంలో కంటే సమర్థంగా ఎదుర్కోగలమని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా స్పష్టం చేశారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసుల తీవ్రత పెరగడంతో ఇప్పటికే చాలామందిలో కొంత హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చే ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు.