Covid Vaccination:వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు.. ఒకేరోజులో 86.29 లక్షల డోసులు

కొవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజులో 86.29 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ నిర్వహించింది.

Covid Vaccination:వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు.. ఒకేరోజులో 86.29 లక్షల డోసులు

Covid Vaccination India Inoculates Record 86.29 Lakh Doses In A Single Day

Covid Vaccination in Inida : కొవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజులో 86.29 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ నిర్వహించింది. కొత్త టీకా విధానాన్ని (new inoculation policy) రూపొందించిన అనంతరం జూన్ 21 తర్వాత రోజువారీ వ్యాక్సిన్ డోసుల్లో ఇదే అత్యధికంగా నమోదైంది. ఇప్పటివరకూ 88.16 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. భారతదేశంలో నిర్వహించే కరోనావైరస్ వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 55 కోట్ల మార్కును అధిగమించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది.

సోమవారం రాత్రి 7గంటల వరకు అందిన నివేదిక ప్రకారం.. కొవిడ్-19 వ్యాక్సిన్ 55 లక్షలకు పైగా మోతాదులు ఇవ్వడం జరిగింది. 18-44 ఏజ్ గ్రూపులో 31,44,650 మొదటి డోసులు వేయగా, 5,22,629 రెండవ డోస్‌లు అందించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 ఏళ్ల వయస్సు గల మొత్తం 20,00,68,334 మంది మొదటి డోసు అందుకున్నారు. ఫేజ్ -3 వ్యాక్సిన్ క్యాంపెయిన్ ప్రారంభమైన తర్వాత 1,59,35,853 మంది రెండవ మోతాదును పొందారు.
Vaccination Vans : హైదరాబాద్‌లో ఇక వ్యాక్సినేషన్ వ్యాన్లు!

భారత్ రికార్డు స్థాయిలో 55 కోట్ల #COVID19 vaccines అందిస్తోంది. కరోనావైరస్‌పై భారతదేశ పోరాటాన్ని బలోపేతం చేద్దాం, టీకా వేయించుకుందాం అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య (Mansukh Mandaviya) సోమవారం ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌తో సహా రాష్ట్రాల్లో 18-44 ఏళ్ల వయస్సులో కోటి కంటే ఎక్కువ మోతాదులో కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అలాగే, ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కోవిడ్ మొదటి డోస్ 18-44ఏళ్ల గల 10 లక్షల మందికి టీకాలు వేశారు. టీకా డ్రైవ్ 213వ రోజు నాటికి.. మొత్తం 55,85,834 టీకా డోసులను ఇచ్చారు. ఇప్పటివరకూ 43,18,152 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ టీకాలను పొందినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే 12,67,682 మంది లబ్ధిదారులు టీకా రెండవ మోతాదును పొందారు.
Vaccination Certificate : వాట్సాప్​లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్..సెకన్లలోనే పొందండి ఇలా