COVIHOME Test Kit : దేశంలోనే తొలిసారిగా.. ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్!

కరోనా టెస్టు కోసం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. ఇకపై ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ కొవిడ్-19 టెస్ట్ కిట్ డెవలప్ చేశారు. IIT హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు.

COVIHOME Test Kit : దేశంలోనే తొలిసారిగా.. ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్!

Covihome, India's First Rapid Electronic Covid 19 Test Kit

COVIHOME Test Kit : కరోనా టెస్టు కోసం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. ఇకపై ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ కొవిడ్-19 టెస్ట్ కిట్ డెవలప్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ ఈ  ‘COVIHOME’ కృత్రిమ కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. వైద్యుల సాయం లేకుండానే ఇంట్లోనే కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా ఈ టెస్టు చేసుకోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో రిజల్ట్ వస్తుందట.

RT-PCR లేదా BSL2 ల్యాబ్ సౌకర్యం అవసరం లేకుండానే RTPCR టెస్ట్‌తో సమానంగా ఈ రిజల్ట్ ఉంటుందని ప్రొఫెసర్ శివ గోవింద్ తెలిపారు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా హోమ్ కిట్‌లో టెస్టు చేసుకోవచ్చుట.. కోవీహోమ్ టెస్టింగ్ కిట్‌ను ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెస‌ర్ గోవింద్ ఆధ్వ‌ర్యంలో ఈ కిట్‌ను త‌యారు చేశారు. ధర కూడా చాలా చౌకగా ఉంటుందట. ఇప్పటికే ఈ డివైజ్ కోసం పేటెంట్ దాఖలు చేసినట్టు తెలిపారు.

కిట్‌ల‌ ఉత్ప‌త్తి కోసం భాగ‌స్వామ్యుల కోసం చూస్తున్నామ‌ని ప్రొఫెస‌ర్ తెలిపారు. COVIHOME కిట్‌‌తో హైదరాబాద్‌లోని ESI మెడిక‌ల్ కాలేజీలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. COVIHOME పరీక్షించిన శాంపిల్స్ RTPCR శాంపిల్స్ పరీక్షలతో పోల్చి చూడగా కిట్ సామర్థ్యం 94.2 శాతం, సున్నితత్వం 91.3 శాతం, నిర్దిష్టత 98.2 శాతం నిర్ధారించింది. ఈ కిట్ ధర రూ.400గా నిర్ణయించారు.