Covishield, Covaxin Antibodies : భారత B.1.617 వేరియంట్‌పై కోవిషీల్డ్, కోవాగ్జిన్ శక్తివంతమైనవే.. కానీ, యాంటీబాడీలు తక్కువ

కరోనావైరస్ మహమ్మారిపై నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనావైరస్‌లోనూ అనేక మ్యుటేషన్లు, వేరియంట్లు, స్ట్రెయిన్లతో మరింత విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు పుట్టకొస్తున్నాయి.

Covishield, Covaxin Antibodies : భారత B.1.617 వేరియంట్‌పై కోవిషీల్డ్, కోవాగ్జిన్ శక్తివంతమైనవే.. కానీ, యాంటీబాడీలు తక్కువ

Covishield, Covaxin Made Fewer Antibodies Against B.1.617 Variant

Covishield, Covaxin fewer antibodies : కరోనావైరస్ మహమ్మారిపై నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనావైరస్‌లోనూ అనేక మ్యుటేషన్లు, వేరియంట్లు, స్ట్రెయిన్లతో మరింత విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు పుట్టకొస్తున్నాయి. మొదటి కరోనావైరస్ ఆధారంగా రూపొందించిన అనేక కరోనా వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై పూర్తి స్థాయిలో ప్రభావంతంగా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండూ, కరోనావైరస్‌పై పోరాడి రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడంలో ప్రభావవంతంగా ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ సైంటిస్టులు వెల్లడించారు.

కానీ, కొన్ని నివేదికల ప్రకారం.. B.1.617 స్ట్రెయిన్ లేదా భారతీయ వేరియంట్‌పై మాత్రం ఈ రెండు వ్యాక్సిన్లు శక్తివంతమైనవే అయినప్పటికీ.. సగం మాత్రమే యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయని గుర్తించారు. అయినప్పటికీ COVID-19 వైరస్‌పై టీకాలు శక్తివంతమైనవని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పూణేలోని ఐసిఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) లోని సైంటిస్టులు జనవరి నుంచి కరోనావైరస్ పాజిటివ్ బాధితుల నమూనాలను సేకరించి వేరియంట్లపై పరీక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వేరియంట్లలో B.1.1.7 (యూకే వేరియంట్), B.1.351 (దక్షిణాఫ్రికా వేరియంట్), P2 (బ్రెజిల్ వేరియంట్) B.1.617 (ఇండియన్ వేరియంట్) అంతర్జాతీయంగా ఆందోళనలను రేకిత్తిస్తున్నాయి. వీటిలో B.1.617 అనే భారతీయ వేరియంట్ సహా మూడు సంబంధిత వేరియంట్లతో భారీగా కేసులు పెరిగిపోతున్నాయి.

గత ఏప్రిల్ నాటికి భారతదేశంలో ఇది ఆధిపత్య స్ట్రెయిన్‌గా మారింది. కోవాక్సిన్ రెండు మోతాదు పొందినవారి నుంచి సేకరించిన యాంటీబాడీల్లో B.1.617 సిగ్నేచర్ మ్యుటేషన్లపై NIV సైంటిస్టులు పరీక్షించారు. అయితే వారిలో B.1 వేరియంట్ కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేసిన యాంటీబాడీల కంటే సుమారు 55శాతం తక్కువ యాంటీబాడీలు ఉన్నాయని కనుగొన్నారు. కోవిషీల్డ్‌తో టీకాలు పొందిన వారిపై అధ్యయనంలో B.1 వేరియంట్ పై యాంటీబాడీల సంఖ్య 42.92గా ఉందని గుర్తించారు. అది B.1.617 వేరియంట్‌పై 21.9గా నమోదైంది.. ఇందులో సగమే యాంటీబాడీలు ఉన్నాయని గుర్తించారు. యాంటీబాడీ స్థాయిలను B.1.1.7 (UK స్ట్రెయిన్)తో పోల్చినప్పుడు.. కేవలం 6శాతం మాత్రమే తగ్గాయి. బ్రెజిలియన్ స్ట్రెయిన్ (P2)కు వ్యతిరేకంగా 50శాతం యాంటీబాడీలు తగ్గాయి.