Covishield+ Pfizer Combination : కొవిషీల్డ్ + ఫైజర్.. రెండు కలిపితే ఫుల్ యాంటీబాడీలు!

కొవిడ్ వ్యాక్సిన్ ఏది మంచిది? రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలా? ఒక డోసు ఒక టీకా.. మరో డోసు ఇంకో టీకా వేసుకోవచ్చా? ప్రతిఒక్కరిలోనూ ఇలాంటి అనుమానాలే ఉన్నాయి.

Covishield+ Pfizer Combination : కొవిషీల్డ్ + ఫైజర్.. రెండు కలిపితే ఫుల్ యాంటీబాడీలు!

Covishield+ Pfizer Combination Will Produce More Antibodies

Covishield+ Pfizer Combination : కొవిడ్ వ్యాక్సిన్ ఏది మంచిది? రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలా? ఒక డోసు ఒక టీకా.. మరో డోసు ఇంకో టీకా వేసుకోవచ్చా? ప్రతిఒక్కరిలోనూ ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. వాస్తవానికి.. కొవిషీల్డ్+ ఫైజర్ టీకా రెండింటికి కలిపి తీసుకుంటే అత్యధిక సంఖ్యలో యాంటీబాడీలు తయారవుతున్నాయని రీసెర్చర్లు చెబుతున్నారు. కరోనాను అంతం చేయడంలో ఈ రెండు టీకాల డోసులు అద్భుతంగా పనిచేస్తున్నాయని బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధక బృందం కొత్త అధ్యయనంలో వెల్లడించింది.

ఈ రెండింటి టీకాలో మొదటి డోసు.. ఒకటి.. రెండో డోసు మరో టీకాను తీసుకోవడం ద్వారా ప్రభావంతంగా పనిచేస్తున్నాయని, అంతేకాదు.. యాంటీబాడీల ఉత్పత్తి కూడా బాగా పెరిగినట్టు తేలిందని అంటున్నారు. యూకేలో ఫైజర్, కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్లలో మొదటి డోసు ఒకటి.. మరొకటి రెండు డోసుతో యాంటీబాడీల ఉత్పత్తి ఎలా ఉందనేదానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయన ఫలితాలను లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.

యూకేలో కొంత మంది వాలంటీర్లకు వేర్వేరు టీకాలు వేసేలా ఆప్షన్ ఇచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. వీరిలో 830 స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారిపై ఈ ట్రయల్ నిర్వహించినట్లు రీసెర్చర్లు తెలిపారు. రెండు వ్యాక్సిన్లలో ఏ టీకా అయినా తొలి డోసుగా తీసుకున్నా సమస్య ఉండదంటున్నారు. కానీ, మొదట డోసుగా ఫైజర్, రెండో డోసుగా కొవిషీల్డ్ తీసుకున్నవారిలో కన్నా.. తొలుత కొవిషీల్డ్, రెండో డోసుగా ఫైజర్ తీసుకున్నవారిలో యాంటీబాడీల ఉత్పత్తి అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనికా) వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం ద్వారా టీకా పని తీరు మెరుగుపడుతుందని తేలింది. మొదటి రెండు డోసులకు మధ్య వ్యవధిని ఇప్పటికే ఆరు వారాల నుంచి 12 వారాలకు పెంచవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ టీకా డోసుల మధ్య గ్యాప్‌ను 45 వారాల వరకూ పెంచడం ద్వారా అధిక స్థాయిలో ఇమ్యూనిటీ వస్తుందని అంటున్నారు.