Banana Chips : రుచిగా ఉన్నాయని అరటికాయ చిప్స్ లాగించేస్తున్నారా? ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్!

అరటి చిప్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. వాటిని సాధారణంగా నూనెలో వేయిస్తారు. ముఖ్యమైన కేలరీలు, చక్కెర, కొవ్వును అందించే తేనె లేదా సిరప్ వంటి పదార్థాలను వీటికి జోడిస్తారు. అరటికాయ చిప్స్ ను బాగా డీప్‌గా నూనెలో వేయించి ప్యాక్ చేస్తారు.

Banana Chips : రుచిగా ఉన్నాయని అరటికాయ చిప్స్ లాగించేస్తున్నారా?  ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్!

banana chips (1)

Banana Chips : అరటిపండు చిప్స్.. వీటిని అరటిని ముక్కలుగా కోసి ఎండిన తరువాత నూనెలో వేయించి తయారు చేస్తారు. స్నాక్స్ గా ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా చక్కెర సిరప్, సుగంధ ద్రవ్యాలు, ఉప్పును వీటి తయారీలో ఉపయోగిస్తారు. అరటిపండ్లు చాలా పోషకమైనవి అయినప్పటికీ, అరటిపండు చిప్స్ గురించి చెప్పాలంటే ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. ఎందుకంటే అరటి పండు చిప్స్ తినటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అరటి చిప్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. వాటిని సాధారణంగా నూనెలో వేయిస్తారు. ముఖ్యమైన కేలరీలు, చక్కెర, కొవ్వును అందించే తేనె లేదా సిరప్ వంటి పదార్థాలను వీటికి జోడిస్తారు. అరటికాయ చిప్స్ ను బాగా డీప్‌గా నూనెలో వేయించి ప్యాక్ చేస్తారు. ప్రతి అరకప్పు చిప్స్ లో 210 కేలరీలతో పాటు 12.5 గ్రాముల కొవ్వును కలిగి వుంటాయి. ఈ చిరుతిండిలో ఫైబర్, కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నప్పటికీ, కొవ్వు, కేలరీలు మరియు చక్కెర కంటెంట్ బరువు పెరిగేలా చేస్తాయి.

ఆస్తమా సమస్య వున్నవారు బనానా చిప్స్ తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఈ చిప్స్ సమస్యను మరింత పెంచుతాయి. చర్మ సంబంధిత ఎలర్జీలు వున్నవారు వీటికి దూరంగా వుండటం మంచిది. అరటి పండు చిప్స్ ను నూనెలో వేయించటం వల్ల కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని అతిగా తినకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఓ కప్పు బనానా చిప్స్‌లో దాదాపు 12 గ్రాముల చెడు కొలెస్ట్రాల్ వుంటుంది కనుక అది గుండెకు మంచిది కాదు.