Viagra Cream : ఈ వయాగ్రా క్రీమ్.. మహిళల్లో లైంగిక ఆనందాన్ని రెట్టింపు చేస్తుందట!

10TV Telugu News

Viagra Cream boost women sex drive : మహిళలకు శృంగారం అనేది ఒక భావోద్వేగంతో నిండినది. అది కలిగినప్పుడే వారు లైంగిక జీవితాన్ని ఆశ్వాదించగలరు. ప్రస్తుత జీవనశైలిలో నిద్రలేమి సహా అనేక అనారోగ్య సమస్యల కారణంగా లైంగిక జీవితంలో ఆనందించలేని పరిస్థితి. అందులోనూ కరోనా ఆందోళన కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. రానురాను చాలా మంది మహిళల్లో లైంగిక వాంఛలతో పాటు శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. మానసికంగానూ శారీరకంగానూ సిద్ధంగా లేకపోవడం వల్ల కుటుంబాల్లో అనేక సమస్యలకు దారితీస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ లైంగిక జీవితాన్ని ఆనందంగా ఉంచుకోనేందుకు అవసరమైన విధానాలను లైంగిక నిపుణులు సూచిస్తున్నారు.

అందులో ఒకటి.. వయాగ్రా.. (Viagra Cream) పురుషుల్లో మాదిరిగానే మహిళల్లోనూ వయాగ్రా వినియోగంలో ఉంది. పురుషుల వయాగ్రా ట్యాబెట్లతో రూపంలో ఉంటుంది. అదే మహిళల్లో అయితే క్రీమ్ రూపంలో వయాగ్రా అందుబాటులో ఉందని చెబుతున్నారు. వయాగ్రా నుంచి తయారైన ఈ క్రీమ్‌ను వాడటం ద్వారా మహిళల్లో  లైంగిక ఆనందానికి సాయపడుతుందని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు. ఈ వయాగ్రా క్రీమ్ (Viagra Cream) ఎలా పనిచేస్తుందో టెస్టింగ్ చేశారు. ఒక టీ స్పూన్ వయాగ్రా క్రీమ్ తీసుకుని తమ జననాంగాలపై రాసి మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం ద్వారా అక్కడి రక్త నాళాలను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా వారిలో లైంగికపరమైన కోరికలు కలుగుతాయట.. లైంగిక సమస్యలతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ వయాగ్రా అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

20ఏళ్ల క్రితమే వయాగ్రా వాడుకలోకి :
లైంగిక సమస్యలతో బాధపడే ముగ్గురు మధ్య వయస్సు ఉన్న వారిలో ఒకరికి లైంగిక వాంఛ (reduce Libido) తగ్గిపోగా.. వృద్ధుల్లో ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉందని గుర్తించారు. వాస్తవానికి వయాగ్రా 20 ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఈ వయాగ్రా మిలియన్ల మంది పురుషుల లైంగిక జీవితాలను మార్చేసింది. కానీ, మహిళల్లో మాత్రం ఈ వయాగ్రా మాత్ర ఒకేరకమైన ఫలితాలను చూపించలేదు. పైగా.. తలనొప్పి, కడుపు నొప్పి, వికారం వంటి దుష్ప్రభావాలు కూడా కలిగాయి. ఇప్పుడు మహిళల్లో లైంగిక సమస్యల కోసం (boost women sex drive) యుఎస్ సంస్థ డేర్ బయోసైన్స్ లిమిటెడ్ (Dare Bioscience Ltd) ఈ వయాగ్రా క్రీమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ క్రీమ్ ఆ చోట రాయగానే వెంటనే పీల్చేసుకుంటుంది. వయాగ్రా క్రీమ్ పనితీరుపై కొన్ని టెస్టులు చేశారు.

ఇందులో జననేంద్రియ రక్త ప్రవాహాన్ని క్రమంగా పెంచుతుందని తేలింది. మాత్రలా పేగుల్లోకి వెళ్లేది కాకపోవడంతో తక్కువ దుష్ప్రభావాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ వయాగ్రా క్రీమ్‌తో తక్కువ లైంగిక కోరికలు కలిగిన 400 మందికి పైగా మహిళలపై ఇప్పుడు అమెరికాలో ట్రయల్ జరుగుతోంది. ఇందులో భాగంగా వారానికి సగం మంది వాలంటీర్లు రెండు నుంచి మూడు సార్లు క్రీమ్‌ను వినియోగిస్తున్నారు. మిగిలిన వారికి మాత్రం ప్లేసిబో అందించారు. వీరిలో ఎవరిలో ఉద్వేగం పొందారో నోట్ చేయమని కోరారు. ఇలా చేయడం ద్వారా కొంతమేరకు ప్రయోజనం ఉండొచ్చునని బ్రిటన్ డాక్టర్ Dr Geoff Hackett అభిప్రాయపడ్డారు. మరి ఉద్రేకం పెరగడానికి కారణం.. ఆ ప్రాంతాన్ని రుద్దడం ద్వారా పెరిగి ఉండొచ్చునని అంటున్నారు.

10TV Telugu News