Curry Leafs : బరువును సులభంగా తగ్గించే కరివేపాకు |Curry leafs for easy weight loss

Curry Leafs : బరువును సులభంగా తగ్గించే కరివేపాకు

కరివేపాకు మొండి పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే అంశాలు కరివేపాకులో ఉంటాయి. కరివేపాకులో పీచు రక్తంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది.

Curry Leafs : బరువును సులభంగా తగ్గించే కరివేపాకు

Curry Leafs : కరివేపాకు సువాసన మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఔషద గుణాలు అధికంగా ఉన్నాయి. బరువు తగ్గాలన్న ఆలోచనతో ఉన్నవారికి కరివేపాకుతో సహాయకారిగా పనిచేస్తుంది. కరివేపాకులో ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌, ఇనుము, క్యాల్షియం, పాస్ఫరస్‌, పీచు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. శరీరం ఫీట్ గా తయారవుతుంది. కరివేపాకులోకార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, దీని కారణంగా జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కరివేపాకు మొండి పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే అంశాలు కరివేపాకులో ఉంటాయి. కరివేపాకులో పీచు రక్తంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకులో లభించే ల్యూటిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకు చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడమే కాకుండా, కంటి చూపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జ్ఞాపకశక్తికి పదును పెట్టడం. వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ కూడా కనిపిస్తాయి, దీని కారణంగా రక్తహీనత ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. కరివేపాకు వల్ల రక్త సరఫారా మెరుగవుతుంది. కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గొచ్చు. ఒక గ్లాసు నీటిని లో 10-15 కరివేపాకులను వేసుకోవాలి. కొద్దిసేపు తక్కువ మంట మీద మరిగించాలి. నీళ్లు కాస్త చల్లారిన తర్వాత వడగట్టి సేవించాలి. ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని కూడా తాగవచ్చు. ఇలా చేస్తే బరువును ఈజీగా తగ్గవచ్చు.

×