Increase Intestinal Health : ప్రేగు ఆరోగ్యాన్ని పెంచడానికి దోహదపడే రోజువారీ అలవాట్లు !

ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రోజువారీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, పెరుగు, కేఫీర్ , కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాలను చేర్చుకోవాలి.

Increase Intestinal Health : ప్రేగు ఆరోగ్యాన్ని పెంచడానికి దోహదపడే రోజువారీ అలవాట్లు !

gut health

Increase Intestinal Health : మన జీర్ణక్రియ ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మన ప్రేగులలో దాదాపు 39 ట్రిలియన్ సూక్ష్మజీవులు ఉన్నాయి. మానవ శరీరధర్మశాస్త్రం, జీవక్రియ, పోషణ , రోగనిరోధక పనితీరులో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గట్ బాక్టీరియా యొక్క సమతుల్యతలో ఏదైనా అంతరాయం ఏర్పడితే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, మలబద్ధకం, లాక్టోస్ అసహనం , జీర్ణ ఆరోగ్య రుగ్మతలకు కారణమవుతుంది.

READ ALSO : Eating Fruit : ప్రతిరోజూ ఒక పండు తినడం ఎందుకు అవసరం? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

GI ట్రాక్ట్  పనితీరు, జీర్ణాశయ ఆరోగ్యానికి సంబంధించిన సంపూర్ణ శ్రేయస్సును పెంచడంలో సహాయపడే ఆహారం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.

మన జీర్ణవ్యవస్థ మన మొత్తం శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోజువారీ అలవాట్లు మన ప్రేగు ఆరోగ్యానికి దోహదం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Coconut Oil : ప్రేగు కదలికను ప్రేరేపించి మలబద్ధకాన్ని తొలగించే కొబ్బరి నూనె!

ప్రేగు ఆరోగ్యం కోసం రోజువారీ అలవాట్లు ;

1. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం ;

ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రోజువారీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, పెరుగు, కేఫీర్ , కిమ్చి వంటి పులియబెట్టిన ఆహారాలను చేర్చుకోవాలి.

2. తగినంత నీరు త్రాగటం ;

పుష్కలంగా నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ హైడ్రేట్‌గా ఉండి సమర్థవంతంగా పని చేస్తుంది. ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉంటే అంతకంటే ఎక్కువ నీరు సేవించవచ్చు.

READ ALSO : White Fungus : వైట్‌ ఫంగస్‌ సోకినవారిలో ప్రేగులకు రంధ్రాలు.. ప్రపంచంలోనే ఫస్ట్ కేసు

3. రోజువారిగా వ్యాయామం ;

వ్యాయామం కండరాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రేగు కండరాలను ఉత్తేజపరుస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. సరిగ్గా పని చేసేలా చేస్తుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి కనీసం 30 నిమిషాల మితమైన వ్యాయామం ప్రతిరోజూ లక్ష్యంగా పెట్టుకోవాలి.

READ ALSO : Benefits Of Garlic : క్యాన్సర్ నివారణకు, జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపరచటంలో వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు !

4. ఒత్తిడిని తగ్గించుకోండి ;

ప్రేగు బాక్టీరియా యొక్క సమతుల్యతను దెబ్బతీయడం, మంటను పెంచడం ద్వారా ఒత్తిడి అనేది ప్రేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రోజువారి దినచర్యలో ధ్యానం, యోగా, లోతైన శ్వాస, ఆడియో విజువల్ రిలాక్సేషన్ టెక్నిక్‌ల వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించాలి.

ఈ అలవాట్లను దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.జీర్ణ సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చుఅని నిపుణులు సూచిస్తున్నారు.