Face Mask : చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఖర్జూరం ఫేస్ మాస్క్!

ఎండు ఖర్జూరాలను 3, 5 తీసుకుని, అందులో విత్తనాలను తొలగించాలి. నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. అరకప్పు పాలను బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అందులో విత్తనాలు తొలగించి కడిగి పెట్టుకున్న ఖర్జూరాలను పాలలో వేసి, ఒక గంట సేపు మెత్తగా నానబెట్టాలి.

Face Mask : చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఖర్జూరం ఫేస్ మాస్క్!

Date Face Mask

Face Mask : ఖర్జూరంతో ఆరోగ్యానికి చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరం జీర్ణశక్తిని మెరుగుపర్చటంతోపాటు, మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగే సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. కడుపులో ఉండే హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇందులో ఉండే సోలబుల్, ఇన్ సోలబుల్ ఫైబర్స్ పొట్ట నిండుగా ఉండేలా చేసి ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చూస్తాయి. వీటిలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఖర్జూరంలో ఉండే పొటాషియం, సల్ఫర్ శరీరంలో కొవ్వులను విచ్ఛినం చేస్తాయి. ఈ ఖర్జూరం పండ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,ఈజిప్ట్ ప్రదేశాల్లో చాలా ఫేమస్. ఇందులో ఉండే అద్భుతమైన న్యూట్రీషియన్ విలువల వల్ల ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది.

డేట్స్ ఫేస్ ప్యాక్ లో పవర్ ఫుల్ విటమిన్ బి 5 ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను స్కిన్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి లు చర్మానికి మాయిశ్చరైజింగ్ గా తోడ్పడతాయి. చర్మం తేమగా,స్మూత్ గా ,అందంగా మారుతుంది. ఖర్జూరంలో ప్యాంటో థెనిక్ యాసిడ్స్, అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఆలస్యం చేస్తుంది. చర్మంలో కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. దీని వల్ల చర్మం ప్రకాశవంతంగా, కాంతివంతంగా తయారవుతుంది.

ఖర్జూరం తో తయారు చేసుకునే ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు, ఫైన్ లైన్స్ వంటివి తొలగిపోయి, స్కిన్ టోన్ అద్భుతంగా మారుతుంది. చర్మంలో తప్పనిసరిగా మార్పులు తీసుకురావడానికి, దీర్ఘకాలం చర్మం కాంతివంతంగాకనబడుటకు డైలీ డైట్ లో కూడా ఎండు ఖర్జూరాలను చేర్చుకోవాలి.

ఖర్జూరం, పాలలో ఫేస్ మాస్క్ తయారీ;

ఎండు ఖర్జూరాలను 3, 5 తీసుకుని, అందులో విత్తనాలను తొలగించాలి. నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. అరకప్పు పాలను బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అందులో విత్తనాలు తొలగించి కడిగి పెట్టుకున్న ఖర్జూరాలను పాలలో వేసి, ఒక గంట సేపు మెత్తగా నానబెట్టాలి. డేట్స్ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు చేర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ లో కొద్దిగా సన్న రవ్వ వేసి మిక్స్ చేయాలి. పేస్ట్ మిశ్రమంలా మారిన తరువాత ఒక టేబుల్ స్పూన్ తేనె , కొన్ని చుక్కల ప్రైమ్ రోజ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం కలగలిసే వరకూ బ్లెండ్ చేయాలి.

ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట అలాగే ఉండనివ్వాలి. అరగంట తర్వాత కొద్దిగా నీళ్ళు తీసుకుని, చర్మం మీద చిలకరించి మర్ధన చేసుకోవాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఖర్జూరం ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తూ , కాంతివంతంగా ఉంటుంది.