Pongal Health Benefits : మకర సంక్రాంతి రోజు తయారు చేసే రుచికరమైన పొంగల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

వెన్ పొంగల్‌లో పెద్ద మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మీ శరీరం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అవాంఛిత కోరికలను అరికట్టడంతో పాటు, పొట్టను ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది.

Pongal Health Benefits : మకర సంక్రాంతి రోజు తయారు చేసే రుచికరమైన పొంగల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

Pongal Health Benefits :

Pongal Health Benefits : భారతదేశం అంతటా మకర సంక్రాంతిని బాగా జరుపుకుంటారు. భారతదేశం అంతటా ఒకే పండుగను జరుపుకున్నప్పటికీ వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉత్తరాన లోహ్రీ, దక్షిణాన పొంగల్, పశ్చిమ ప్రాంతంలో మకర సంక్రాంతి, గుజరాత్‌లో ఉత్తరాయణం జరుపుకుంటారు. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సంక్రాంతి పండుగలో భాగంగా, పొంగల్‌ను సిద్ధం చేస్తారు. పంటగనాటికి పాడిపంటలన్నీ పొలాల నుండి ఇంటికి చేరతాయి. కొత్త పంట ధాన్యాలతో ఈ పొంగల్ వంటకాన్ని తయారు చేస్తారు. దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన పొంగల్ మకర సంక్రాంతికి సంబంధించిన వంటకం. పొంగల్ యొక్క ప్రయోజనాలను తెలుసుకోవటానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు.

పొంగల్ అంటే ఏమిటి?

దీనిని పొంగలి లేదా హగ్గి అని కూడా అంటారు. తమిళంలో పొంగల్ అంటే ఉడకబెట్టడం లేదా బుడగ పెట్టడం. ఇది రెండు రకాలుగా చేస్తారు. చక్కరతో తయారైన పొంగల్ తీపిగా ఉంటుంది. చక్కెర పొగల్ తయారీకి మంచి నాణ్యమైన బియ్యం, పెసరపప్పు, బెల్లం మరియు పాలను, యాలుకలు, కిస్మిస్ లను ఉపయోగిస్తారు. అలాగే వెన్ పొంగల్ దీనినే మరో పేరుతో కట్టెపొంగలి అంటారు. దీని తయారీకి నెయ్యిని ఉపయోగిస్తారు. బియ్యం, పెసరపప్పు, కొన్ని మిరియాలు, జీడిపప్పు, మిరపకాయలు, జీలకర్ర జతచేసి స్పైసీగా తయారు చేస్తారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.

కట్టె పొంగల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

1. ప్రొటీన్లు అధికంగా ఉంటాయి ;

వెన్ పొంగల్‌లో బియ్యం, సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, మూంగ్ పప్పు, జీడిపప్పు, మిరపకాయలు మరియు ఉప్పును కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా, రక్తప్రవాహంలో శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే ప్రక్రియలలో దీనిలోని ప్రోటీన్ కూడా ముఖ్యమైన భాగం. ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలతో పోరాడే ప్రతిరోధకాలతో కలిపి తయారు చేయడంతోపాటుకణాలను ఆరోగ్యంగా ఉంచడం మరియు కొత్త వాటిని పెంచడంలో దోహదపడుతుంది.

2. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ;

వెన్ పొంగల్‌లోని పదార్థాలను పరిగణనలోకి తీసుకుంటే దీనిలో ఉపయోగించే పప్పు, మసాలాలు, నెయ్యి, బియ్యం, అవన్నీ యాంటీఆక్సిడెంట్‌ల యొక్క అద్భుతమైన మూలాలు. బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడానికి, సాధారణ జలుబు మరియు దగ్గును నివారించడానికి ఆహారాలలో యాంటీఆక్సిడెంట్లు ప్రయోజనకరంగా తోడ్పడతాయి.

3. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ;

వెన్ పొంగల్‌లో పెద్ద మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మీ శరీరం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అవాంఛిత కోరికలను అరికట్టడంతో పాటు, పొట్టను ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ ప్రక్రియకు దోహదం చేస్తుంది. ప్రేగు సమస్యలను కూడా నివారిస్తుంది. అదనంగా, మిరియాలు మరియు అల్లంతో సహా ఇతర పదార్థాలు, మలబద్ధకం నివారణను సులభతరం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

4. వికారాన్ని తగ్గిస్తుంది ;

వెన్ పొంగల్‌ను తయారుచేసే పదార్థాలలో మిరియాలు మరియు అల్లం ఉన్నాయి. అలాగే అల్లం, మిరియాలు వికారం తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, వికారం అనుభూతిని అణిచివేస్తాయి. మంచి అనుభూతిని పొందేలా చేస్తాయి.

ఒక కప్పు వెన్ పొంగల్‌లో 212 కేలరీలు ఉంటాయి, వీటిలో 116 కేలరీలు కార్బోహైడ్రేట్లు, 22 కేలరీలు ప్రోటీన్, 74 కేలరీలు కొవ్వు ఉంటుంది. సగటు రోజువారి కేలరీలలో సుమారు 11 శాతం అందిస్తుంది. పిల్లల నుండి వృద్దుల వరకు అంతా దీనిని తినటానికి ఇష్టపడతారు. అయితే దీనిని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

కట్టె పొంగలి తయారీ విధానం ;

కట్టెపొంగలి తయారీ కోసం కావాల్సిన పదార్దాల విషయానికి వస్తే బియ్యం- పావుకిలో, పెసరపప్పు- 150 గ్రాములు, ఉప్పు- తగినంత., తాలింపు వెయటానికి నెయ్యి- మూడు చెంచాలు , జీలకర్ర- చెంచా, మిరియాలు- చెంచా, అల్లం – చిన్న ముక్క, కరివేపాకు- నాలుగు రెబ్బలు, జీడిపప్పులు- పది తీసుకోవాలి.

ఇలా తయారు చేసుకోండి ;

బియ్యం, పెసరపప్పు కలిపి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కిన తరువాత జీడిపప్పు వేయించాలి. అవి కాస్త ఎర్రగా వేగిన తరువాత జీలకర్రా, మిరియాలపొడీ, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి. అవి కూడా వేగాక సరిపడా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టిన పెసరపప్పు, బియ్యం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పూర్తిగా ఉడికిన తరువాత దించుకోవాలి. కొత్తిమీర తురుము చల్లుకోవచ్చు. దీనిలోకి పల్లీచట్నీగాని, కొబ్బరి, చట్నీగాని, అల్లం చట్నీ గానీ, ఏదైనా చట్నీతో కలుపుకుని తీసుకోవచ్చు.

 

 

.