Sambar Idli : రుచికరమైన సాంబార్ ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదే!..

సాంబార్ ఇడ్లీలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనిషికి కావాల్సిన ప్రొటీన్లు, ఫైబర్లు ఇందులో లభ్యమౌతాయి.

Sambar Idli : రుచికరమైన సాంబార్ ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదే!..

Sambar

Sambar Idli : వేడీ, వేడీ ఇడ్లీలతో సాంబారు కాంబినేషన్ని ఇష్టపడని వారుండరు. ఒక్కసారి రుచిచూస్తే పదేపదే తినాలినిపిస్తుంటుంది. ఇడ్లీ సాంబరు రుచి చూడటం కోసం చాలా మంది ఉడిపి హోటల్స్ కు వెళుతుంటారు. దీనిని తయారు చేసుకోవటం కూడా చాలా తేలిక. అంతేకాకుండా సాంబార్ ఇడ్లీ తీనటం ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సాంబార్ ఇడ్లీలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనిషికి కావాల్సిన ప్రొటీన్లు, ఫైబర్లు ఇందులో లభ్యమౌతాయి. సాంబారు తయారీలో పచ్చి బఠాణిలు, అలసందలు, బీన్సు, పొటాటో, క్యారెట్, బ్రోకోలి, ఆనియన్, గార్లిక్ క్లోవ్సు, సీజన్లో దొరికే టమోట, గుమ్మడి, బెండ, వంకాయ, సొరకాయలను ఉపయోగిస్తారు. వీటి వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో మునగకాయలు వాడితో అందులోని కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. రుచి, శువాసనకోసం మసాల దినుసులతో ఇంట్లోనే సాంబారు పొడిని తయారుచేసుకోవచ్చు. రుచికోసం తీపికోసం కొద్ది మొత్తంలో బెల్లం వాడతారు.

మినపప్పు, బియ్యపు పిండితో ఇడ్లీని తయారు చేస్తారు. ఇడ్లీలు ఆవిరిమీద తయారావుతాయి కాబట్టి ఎక్కువ పోషకాలు వంటలో నష్టపోవు. వీటీని నెయ్యి, కారపుపోడులతో తీసుకొనేఅలవాటుని ఆరోగ్యరీత్యా ఆపివేయాలి. అలాగే సాంబారురైసుగా కూడా  చాలా మంది తీసుకుంటుంటారు. అయితే దీనిని పాలీషుచేయని ముడిబియ్యంతో  తీసుకోవడం ఆరోగ్యరీత్యా మంచిది. షుగర్ వ్యాదిగ్రస్తులు దీనిని తప్పకపాటించాలి. సాంబారు రైస్ లో గుమ్మడి, స్వీట్ పొటాటోలని తక్కువుగా ఉపయోగించాలి.

సాంబారు రెసిపిలో వాడే చింతపండుపులుసు మంచి ఔషధకారిణి, మరియు విరోచనకారి. ప్రేవువ్యవస్థని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, థయామిన్, మాగ్నిషీయం, పోటాషీయంలు సంవృద్దిగా లభ్యమౌతాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగని రోజు అదేపనిగా సాంబార్ ఇడ్లీ తీసుకోవటం ఏమంత మంచిది కాదు. వారంలో రెండు మూడు సార్లు ఇడ్లీ సాంబార్, సాంబార్ అన్నం తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.