Delta Variant : డేంజరస్.. డెల్టా వేరియంట్.. పెద్దలు, చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే?

డేంజరస్ డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. యూకేలో ఈ వేరియంట్.. ఇతర వేరియంట్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. యూకే వేరియంట్ కెంట్ (Alpha-Kent) ను కూడా అధిగమించేసింది.

Delta Variant : డేంజరస్.. డెల్టా వేరియంట్.. పెద్దలు, చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే?

Delta Variant Symptoms In Adults And Children

Delta Variant symptoms in adults and children : డేంజరస్ డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. యూకేలో ఈ వేరియంట్.. ఇతర వేరియంట్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. యూకే వేరియంట్ కెంట్ (Alpha-Kent) ను కూడా అధిగమించేసింది. డెల్టా వేరియంట్.. 80 శాతం కెంట్ వేరియంట్ కంటే వేగంగా వ్యాపించగలదు. కరోనా వ్యాక్సిన్లతో వైరస్‌ను అంతం చేయొచ్చునని భావిస్తే.. ఎప్పటికప్పుడూ సరికొత్త వేరియంట్లు, మ్యుటేషన్లతో విజృంభిస్తోంది. భారీ మొత్తంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైనా కొత్త కొవిడ్ వేరియంట్ల ముప్పు ఎందుకు ఏర్పడుతుంది.. ప్రస్తుత వ్యాక్సిన్లు ఎంతవరకూ ప్రాణాంతక డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలవు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. డెల్టా వేరియంట్ పై కూడా వ్యాక్సిన్లు దీర్ఘకాలిక ప్రభావాన్ని తగ్గించగలవని ఓ అధ్యయనంలో రుజువైంది. ఇదో రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

సాధారణంగా పూర్తి డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ కరోనా సోకుతోంది.. కానీ, డెల్టా వేరియంట్ విషయంలోనూ మంచి స్థాయిలోనే రక్షణ ఉంటుందని చెప్పవచ్చు. కానీ, ఒక డోసు మాత్రమే తీసుకున్నవారిలో 33 శాతం మాత్రమే డెల్టా నుంచి రక్షణ ఇవ్వగలవని అంటున్నారు. అయినప్పటికీ వైరస్ బారినపడినప్పటికీ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరే అవకాశాలు తగ్గినట్టు గుర్తించారు. కరోనా సోకిన 30ఏళ్లలోపు వారిలో డెల్టాపై రోగనిరోధక స్థాయి జీరోగా ఉందని తేలింది. అసలైన మూలం కరోనా వేరియంట్లలో కంటే B.1.617.2 డెల్టా వేరియంట్ లక్షణాలు విభిన్నంగా ఉంటాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

అందులో తరచుగా కనిపించే లక్షణాల్లో దగ్గు, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటివి కూడా. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డెల్టా వేరియంట్ లక్షణాలు అసలు ఉండకపోవచ్చు.. లేదా స్వల్పంగానూ ఉండొచ్చు.. PHE డేటా ప్రకారం.. డెల్టా కేసుల్లో ఎక్కువగా తీవ్రంగానే ఉన్నాయని ఆధారాలు చూపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరే రేటు కూడా రెట్టింపు స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ లో ఈ వేరియంట్ బారినపడి 161శాతం మంది ఆస్పత్రిలో చేరారు. ఇంతకీ డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. పెద్దల్లో ఎలా? చిన్నారుల్లో ఎలా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పిల్లల్లో లక్షణాలు ఇవే :
– అలసట
– తలనొప్పి
– జ్వరం
– గొంతునొప్పి, ముక్కు కారడం, దిబ్బెడ
– ఆకలి లేకపోవడం

అదే పెద్దల్లో మాత్రం పిల్లల్లో కంటే వేరుగా లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలామందిలో పెద్దవారిలో అందులోనూ 40లోపు వారిలో తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు దిబ్బెడ వంటి లక్షణాలు ఉంటున్నాయి. 40 దాటిన వారిలో తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ముక్కు దిబ్బెడ, తుమ్ములు వంటివి కనిపిస్తున్నాయి.

డెల్టా.. ఎవరిపై ఎక్కువ ప్రభావమంటే? :
యువకుల్లో.. అందులోనూ అసలు వ్యాక్సిన్ వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్ అధిక ప్రభావం ఉంటుందని అంటున్నారు. గతంలోని కరోనా వేవ్ ల కంటే డెల్టా వేరియంట్ బారినపడి యువకులే ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అందుకే 30ఏళ్ల లోపు యువకుల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ద్వారా డెల్టా వేరియంట్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే.. 50ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోకపోతే.. డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

డెల్టా కేసులు ఎన్ని ఉన్నాయంటే? :
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (PHE) లేటెస్ట్ డేటా ప్రకారం.. జూన్ 18 నాటికి 76వేల డెల్టా కేసులు ఉన్నాయని వెల్లడించారు. యూకేలో ఏప్రిల్ మధ్యలో మొదటిసారిగా ఈ డేల్టా వేరియంట్ బయటపడింది. ఇప్పటివరకూ 80శాతానికి పైగా డెల్టా కేసులు నమోదైనట్టు డేటా వెల్లడించింది. యూకేలో కొత్తగా 99శాతం డెల్టా వేరియంట్ కేసులు నమోదైనట్టు డేటా పేర్కొంది.