ఆమె 8 నెలల గర్భిణీ.. కరోనా సోకిన వారికి సాయం చేయాలని 250 కిలోమీటర్లు ప్రయాణించిన నర్సు

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 05:16 AM IST
ఆమె 8 నెలల గర్భిణీ.. కరోనా సోకిన వారికి సాయం చేయాలని 250 కిలోమీటర్లు ప్రయాణించిన నర్సు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. కరోనా బారినపడిన బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది 24 గంటలూ పనిచేస్తూనే ఉన్నారు. అత్యవసర సమయాల్లో కరోనా పేషెంట్లకు వైద్య సాయం చేసేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిసి కూడా తమ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టేసి వైరస్ సోకిన వారి రక్షణే తమ కర్తవ్యంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇలాంటి అంకింతభావమే కలిగిన ఎస్. వినోత్ని అనే 25ఏళ్ల నర్సు కరోనా బాధితులకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. తాను 8 నెలల గర్భిణి అయినప్పటికీ తన ప్రాణాలు లెక్క చేయలేదు. తిరూచీ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని రామనాథపురానికి ప్రయాణించింది. తిరూచీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏప్రిల్ 1న జాయింట్ డైరెక్టర్ (JD)ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆఫ్ రామనాథపూరం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. (AIIMS డాక్టర్ భార్యకు కరోనా పాజిటివ్.. ఆ మరుసటి రోజే పండంటి బాబుకు జన్మనిచ్చింది!)

ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC)లో సేవలు అందించేందుకు వినోత్ని అక్కడుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. DYFI జిల్లా సెక్రటరీ పి. లెనిన్, టూరిజం మంత్రి వెల్లమండి ఎన్. నాటరాజన్, కలెక్టర్ ఎస్. శివరాసుల సాయంతో లాక్ డౌన్ అయినప్పటికీ బయటకు వెళ్లేందుకు పాస్ అనుమతి తెచ్చుకుంది. వినోత్ని 8నెలల గర్భిణి కావడంతో  తొలుత వీరంతా నిరాకరించారు. (అమెరికాలో అల్లకల్లోలం.. కరోనా మృతదేహాలు పూడ్చేందుకు స్థలం కొరత)

అయినా పట్టు వదలకుండా సాయం చేయాలనే ధృఢసంకల్పంతో వారిని ఒప్పించింది. తన భర్తతో కలిసి తిరూచీ నుంచి కారులో రామనంతపురానికి చేరుకుంది. ఇలాంటి క్లిష్ణ పరిస్థితుల్లోనూ తమ వృతిపట్ల అంకితాభావం కలిగి బాధితులకు వైద్యం చేయాలనుకునే ప్రొఫెషనల్ వైద్య సిబ్బందికి ప్రతిఒక్కరూ బిగ్ సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది.