Carrot Peels : శరీరానికి కావాల్సిన పోషకాలు క్యారెట్ పైన ఉండే తొక్కలో కూడా ఉన్నాయన్న విషయం తెలుసా?

నానబెట్టిన గింజలతో పాటు క్యారెట్ తొక్కలు బ్లెండ్ చేసి వాటిని కొబ్బరి పాలతో బాగా ఉడికించాలి. ఉప్పు, కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఈ ఫైబర్ రిచ్ సూప్ ఎంతో రుచిగా ఉండి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Carrot Peels : శరీరానికి కావాల్సిన పోషకాలు క్యారెట్ పైన ఉండే తొక్కలో కూడా ఉన్నాయన్న విషయం తెలుసా?

Did you know that the skin on the top of the carrot contains nutrients that the body needs_

Carrot Peels : పచ్చి కూరగాయలలో ఎక్కువ ఇష్టంగా తినేది క్యారెట్. క్యారెట్ ని మనం ఉప్మా, సాంబార్, పలావులలో ఎక్కువగా వాడతాము. క్యారెట్ ని ఉపయోగించి కూర, క్యారెట్ రైస్, క్యారెట్ ఫ్రై కూడా చేసుకుంటాము. క్యారెట్ రంగే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ లో విటమిన్ A, B1,B2, B3, B6, C మరియు బీటా కెరోటిన్, కాల్షియమ్, పొటాషియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఇందులో ఉండే కెరోటిన్ కంటికి చాలా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచి రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం రక్తనాళాలకి మేలు చేస్తుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తరచూ క్యారెట్ తినడం వల్ల మలబద్ధకం సమస్య రాదు. చిన్న పిల్లలకి బియ్యం, క్యారెట్, బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది క్యారెట్ తొక్కు తీసేసి వండుకుంటారు. కానీ ఆ తొక్కలో అనేక పోషకాలు ఉన్నాయి. క్యారెట్ తొక్కలో మూడింట ఒక వంతు ఫైబర్ ఉంటుంది. ఆ తొక్కతో కూడా రకరకాల వంటలు చేసుకోవచ్చు.

క్యారెట్ తొక్కతో ఉపయోగాలు ;

క్యారెట్ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటికి కొద్దిగా మసాలాలు జోడించి చిప్స్ మాదిరిగా వేసుకోవచ్చు. బంగాళాదుంపలు చిప్స్ వేసుకున్నట్టుగా క్యారెట్ తొక్కతో చిప్స్ చేసుకుంటే చాలా రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. క్యారెట్ తొక్కలని ఉడకబెట్టి దానికి కొంచెం ఉప్పు వేసి వాటిని ఏదైనా కూర లేదా సూప్ కూడా చేసుకోవచ్చు. తొక్కల్లో ఉండే ఫైబర్ శరీరానికి అన్నీ విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది.

నానబెట్టిన గింజలతో పాటు క్యారెట్ తొక్కలు బ్లెండ్ చేసి వాటిని కొబ్బరి పాలతో బాగా ఉడికించాలి. ఉప్పు, కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఈ ఫైబర్ రిచ్ సూప్ ఎంతో రుచిగా ఉండి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. శాండ్ విచ్, ర్యాప్ ఇలా ఏ రుచికరమైన వంటకం మీద చక్కగా అలంకరించడానికి ఉపయోగించుకోవచ్చు. తొక్కలను నీటిలో శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు.

క్యారెట్ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూర లేదా సూప్ లో ఉపయోగించవచ్చు. పోషక విలువలు పెంచుకోవడానికి సలాడ్స్ లో కూడా వీటిని జోడించుకోవచ్చు. క్యారెట్ తొక్కలను షుగర్ సిరప్ లో నానబెట్టి వాటిని 200 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర 30 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత 100 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద అవి పొడిబారె వరకు ఉంచుకోవాలి. ఇంట్లో తయారు చేసుకోగలిగే సింపుల్ స్వీట్. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.