Wheat Flour : శనగపిండితోనే కాదు గోధుమ పిండితోనూ అందాన్ని పెంచుకోవచ్చు తెలుసా?

రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు కూడా కలపాలి.

Wheat Flour : శనగపిండితోనే కాదు గోధుమ పిండితోనూ అందాన్ని పెంచుకోవచ్చు తెలుసా?

Did you know that you can enhance your beauty not only with gram flour but also with wheat flour?

Wheat Flour : శనగపిండే కాదు గోధుమ పిండితో అందాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై గోధుమపిండిని పైపూతగా వాడటం వలన చర్మకాంతి మెరుగవుతుంది. గోధుమ పిండితో ట్యాన్ ను సులభంగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గోధుమ పిండితో ఫేస్ ప్యాక్ తయారీ ;

ముందుగా రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు కూడా కలపాలి. పెరుగులో బ్లీచింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ట్యాన్ సులభంగా పోతుంది. దానిలో కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలపాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ లైటెనింగ్ చేయడానికి సహాయం చేస్తుంది. ఒక స్పూన్ ఓట్స్ కూడా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ ని చంపేస్తుంది.

ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపి ముఖానికి రాసుకోవాలి. అది ఎండిపోయేంత వరకు రుద్దుతూనే ఉండాలి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం మెరిసిపోతుంది. ట్యాన్ కూడా తొలగిపోయి కాంతి వంతంగా మారుతుంది.