పసిప్రాయం పట్టుతప్పుతోంది : పిల్లలకు సురక్షితమైన ఇంటర్నెట్ అందించలేమా?

  • Published By: sreehari ,Published On : November 30, 2019 / 07:42 AM IST
పసిప్రాయం పట్టుతప్పుతోంది : పిల్లలకు సురక్షితమైన ఇంటర్నెట్ అందించలేమా?

చిన్నారులపై ఇంటర్నెట్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. రెండేళ్లకే పసి హృదయాలను స్మార్ట్ ఫోన్లు ప్రభావితం చేస్తున్నాయి. చదువులు కంటే ఇంటర్నెట్ పైనే ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటున్నారు. స్నేహితులతో ఆడుకోవాల్సిన పసి వయస్సులో ఆన్ లైన్ గేమ్స్ కోసం ఆరాపడిపోతున్నారు. ఇంటర్నెట్ లో మంచి విషయాల కంటే చెడు విషయాలే చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నడంలో సందేహం లేదు. గంటల తరబడి ఆన్ లైన్ లోనే గడిపే చిన్నారులు ఎంతోమంది. ఇంటర్నెట్ లో ఎక్కువ సమయం గడిపే పిల్లలపై వారి తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు పిల్లల భవిష్యత్తుపై ఎప్పుడూ ఒక కంట కనిపెడతూనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్ పిల్లలకు ఎంతవరకు సురక్షితమంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 

ప్రశ్నార్థకంగా పిల్లల భవిష్యత్తు :
ఇటీవల చైల్డ్ ప్రొటక్షన్ వాయిలేషన్స్ కు సంబంధించి చిన్నారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్ ఎక్కువగా వాడే చిన్నారుల్లో చెడు వ్యసనాలకు అలవాటుపడి పోయే పరిస్థితి ఉంది. అశ్లీల వైబ్ సైట్లు, సోషల్ మీడియాలో ప్రేమ వంటి ఎన్నో రకాల చెడు ఆలోచనలతో భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ మొదలై (వరల్డ్ వైడ్ వెబ్) 30ఏళ్లు అవుతోంది. ఇదే ఏడాదిలో బాలల హక్కులపై యూఎన్ కన్వెన్షన్ ప్రారంభమై కూడా సరిగ్గా 30ఏళ్లు అవుతోంది. ఇంటర్నెట్ చిన్నారులపై ప్రభావం ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో అందిస్తూ గొప్ప కమ్యూనికేషన్ టూల్ గా మారిపోయింది. కానీ, ఇదే టెక్నాలజీ.. చిన్నారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పిల్లలను ప్రమాదంలో పడేస్తుంది కూడా. మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సింది ఒకటే.. డిజిటల్ ప్రపంచంలో ఈ రోజు చిన్నారులకు ఎంతమేరకు సురక్షితమైన వాతావరణమంటే అవును అని చెప్పలేని పరిస్థితి. 

ఈ రెండు లక్ష్యాలు సాధించినప్పుడే :
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 50శాతానికి పైగా చిన్నారులు హింసకు గురవుతున్నారు. 2015లో సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (SDGs) ప్రపంచంలోని అన్ని దేశాల్లోని చిన్నారులు సహా అందరికి మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా గ్లోబల్ కమిట్ మెంట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో రెండు లక్ష్యాలుగా పెట్టుకుంది. అందులో ఒకటి.. 2030 నాటికి చిన్నారులపై అన్ని రకాల హింసాత్మక విషయాలకు ముగింపు పలకాలని SDG 16.2 పిలుపునివ్వడం. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను విస్తరించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధికంగా చిన్నారులు ఉండే ఇంటర్నెట్ కనెక్టవిటీ లేని ప్రాంతాలకు చేరడమే 9.C లక్ష్యం మరొకటి. ఈ రెండు లక్ష్యాలును సాధించాలంటే తక్షణమే ఆన్ లైన్ లో పిల్లల సురక్షితంపై ప్రాధాన్యత తప్పక ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఆన్ లైన్ లో చిన్నారులపై అట్రాసిటీలు పెరిగిపోతున్నాయి. పిల్లల హక్కులకు ఎలా భంగం వాటిల్లుతుందో చూస్తునే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో చిన్నారులను డిజిటల్ ప్రపంచంలోని బెనిఫెట్స్ యాక్సస్ నిరోధించకుండానే వారిని ఆన్ లైన్ నుంచి సేఫ్ గా ఉంచేలా బాధ్యత అందరిపైనా ఉంది.  

వారి సురక్షితం కోసం మనమేం చేస్తున్నాం:  
కొన్ని దేశాలు చిన్నారుల కోసం ప్రత్యేకించి కొన్ని రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చాయి. ఆఫ్ లైన్ మాదిరిగానే ఆన్ లైన్ లో కూడా పిల్లల కోసం ప్రత్యేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టాయి. యూకే, ఆస్ట్రేలియా దేశాలు ఆన్ లైన్ లో చిన్నారుల సంరక్షణలో ముందున్నాయి. పిల్లలపై ప్రభావం లేకుండా సురక్షితమైన డిజైన్, డిఫాల్ట్ కోడ్ డెవలప్ చేశాయి. వీటిని అన్ని కంపెనీలు తప్పక అనుసరించేలా రూల్స్ తీసుకొచ్చాయి. చైల్డ్ ఫ్రెండ్లీ టర్మ్స్ అండ్ కండీషన్స్ క్రియేట్ చేశాయి. డిజిటల్ ప్రపంచంలో పిల్లల హక్కులు, వారి సంరక్షణ కోసం స్పెషల్ కమీషనర్లను కూడా నియమించుకున్నాయి. సేఫర్ ఆన్ లైన్ స్పేస్ కోసం కొంతమంది నిపుణులు.. విభన్నమైన టూల్స్, మార్గదర్శకాలను అందిస్తున్నారు. 

దేశాలు, కంపెనీలకు వీటిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో పిల్లల సంరక్షణ కోసం WePROTECT మోడల్ ఆఫ్ నేషనల్ రెస్పాన్స్ ఫ్రేమ్ వర్క్, చిల్డ్రన్ రైట్స్ అండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ (CRBP)ని UNICEF, UN గ్లోబల్ కాంపాక్ట్, ITU చైల్డ్ ఆన్ లైన్ ప్రొటెక్షన్ గైడ్ లైన్స్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాయి. కొన్ని కంపెనీల్లో NetClean అనే  కంపెనీ కొన్ని టూల్స్ డెవలప్ చేసింది. బిజినెస్ కంపెనీల్లోని కంప్యూటర్లలో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి వీడియోలు, ఫొటోలను డిటెక్ట్ చేసేలా ఈ టూల్స్ డెవలప్ చేశాయి. NGO థ్రోన్ అనే కంపెనీ తమ ప్లాట్ ఫాం నుంచే నేరుగా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటేరియల్ (CSAM) టూల్ ద్వారా గుర్తించి తొలగించనున్నట్టు రిపోర్టు చేసేలా రూపొందించింది. ఇలా మరెన్నో టూల్స్ పిల్లల సంరక్షణ కోసం పలు కంపెనీలు డెవలప్ చేసి పర్యవేక్షిస్తున్నాయి.    

మనం చేస్తుంది చాలా? ఇంకేం చేయాలి?
ఈ ఏడాదిలో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఔట్ ఆఫ్ ది షాడోస్ ఇండెక్స్ అనే సూచికను విడుదల చేసింది. ఇందులో 60 వరకు దేశాల్లో పిల్లలపై లైంగిక వేధింపులకు గురైన విషయాలను వెల్లడించింది. చైల్డ్ ఆన్ లైన్ సెక్సువల్ వాయిలెన్స్ కు సంబంధించి ఐసీటీ ఇండస్ట్రీ స్పందనపై కూడా ఈ కొత్త టూల్ విశ్లేషిస్తోంది. ఈ సూచికతోపాటు సర్వే చేసే కొంతమంది బ్రాడ్ బ్యాండ్ కమిషనర్లు ఆన్ లైన్ లో పిల్లల సురక్షితం కోసం చేసేది సరిపోదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకూ ఏ దేశం కూడా కచ్చితమైన చైల్డ్ ఆన్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కలిగి లేదని అంటున్నారు. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి మెటేరియల్స్ ప్రతి ఏడాది ఇంటర్నెట్లో పుట్టల కొద్ది పుట్టకొస్తోందని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో పిల్లలపై లైంగిక వేధింపులతో పాటు 45 మిలియన్ల పిల్లల ఫొటోలు, వీడియోలనుగుర్తించినట్టు టెక్నాలజీ కంపెనీలు తమ రిపోర్టులో తెలిపాయి.  

పిల్లలందరికీ సురక్షితమైన డిజిటల్ ప్రపంచం.. ఏం చేయగలం?: 
కొత్త (చైల్డ్ ఆన్ లైన్ సేఫ్టీ రిపోర్టు) పిల్లల ఆన్‌లైన్ భద్రతా నివేదిక సిఫార్సుల ఆధారంగా ఈ రిపోర్టును పరగణనలో తీసుకోవడం జరిగింది. 

* పిల్లల హక్కులను పరిరక్షించే బలమైన, సమర్థవంతంగా అమలు చేయగల చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ అవసరం. 
* ఒక సంస్థ సంస్కృతితో పిల్లల భద్రతను నిరంతరం ప్రోత్సహించవచ్చు.
* పిల్లల విద్యపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హక్కులు ఉండేలా చూడాలి.
* డిజిటల్ ప్రపంచంలో ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై పిల్లలకు విద్య
* పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం, సంరక్షకులు, విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు, కమ్యూనిటీ లీడర్లతో విద్యాభోదన 
* వయస్సుకి తగిన ఆన్‌లైన్ ఉత్పత్తులు సేవలు అందేలా చూసుకోవాలి. 
* పిల్లలు, నేరస్తులు వర్చువల్ కాదు. వారే నిజమైన వ్యక్తులు అని గుర్తుంచుకోవాలి.  
* సాంకేతిక పరిష్కారాలు, నిధులతో చట్ట అమలు సంస్థలకు మద్దతు ఇవ్వాలి 
* తద్వారా వారు ఎక్కువ మంది పిల్లలను రక్షించగలరు