Management Of Diabetes : మధుమేహులు దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించటం తప్పనిసరా?

పాదాల పై బొబ్బలు ఏర్పడినా, గీసుకుపోయితే నిర్లక్ష్యంగా అదే తగ్గతుందికదా అని వదిలేయరాదు. పండు చిన్నదైనా చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రస్ధాయి ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది.

Management Of Diabetes : మధుమేహులు దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించటం తప్పనిసరా?

Management Of Diabetes : మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్ధాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. నిత్యం అనేక జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వైద్య చికిత్స తోపాటు ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులు తోడైతే మధుమేహం అదుపులో ఉంటుంది. క్రమంతప్పకుండా వ్యాయామాలు, మందులు వాడుకోవటం, పోషకాహారం తీసుకోవటం, బరువును అదుపులో పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మధుమేహులు పాటించాల్సిన జాగ్రత్తలు ;

1. మధుమేహులు అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల సైతం ప్రమాదం పొంచి ఉంటుంది. గుండె పోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొవ్వులు, ఉప్పు తగ్గించాలి.

2. పొగతాగటం వంటి అలవాట్లను మానుకోవాలి. పొగతాగటం వల్ల పాదాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో ఇన్ ఫెక్షన్లకు దారి తీసి పుండ్లు ఏర్పడతాయి. పుండ్లు త్వరగా తగ్గక పోతే చివరికి వేళ్లు , పాదాలు తొలగించాల్సి వస్తుంది. కళ్లు, కిడ్నీలు సైతం దెబ్బతింటాయి. మధుమేహం ఉన్నవారిలో పొగతాగే అలవాటు ఉంటే మానేయటం మంచిది.

3. మధుమేహం ఉన్నవారు నోటి ఆరోగ్యంపై ముఖ్యంగా దృష్టిపెట్టాలి. చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవాలి. దంతాల మధ్య సన్నటి దారంతో శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక మారు దంత పరీక్షలు చేయించుకోవాలి. చిగుళ్లు ఉబ్బినా, రక్తం కారుతున్నా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

4. పాదాల పై బొబ్బలు ఏర్పడినా, గీసుకుపోయితే నిర్లక్ష్యంగా అదే తగ్గతుందికదా అని వదిలేయరాదు. పండు చిన్నదైనా చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రస్ధాయి ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది. గోరు వెచ్చని నీటితో పాదాలు శుభ్రపరుచుకోవాలి. వేళ్ల మధ్య తడిలేకుండా తుడుచుకోవాలి. పాదాల్లో ఏమాత్రం తేడాలున్నా వెంటనే చికిత్స నిమిత్తం వైద్యులను సంప్రదించటం మంచిది.

5. మధుమేహులు ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవటానికి ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి సాధన చేయాలి. అన్నింటికన్నా కంటి నిండా నిద్రపోవాలి. రోజుకు 7గంటలు నిద్రకు తప్పనిసరిగా కేటాయించాలి.

వైద్యుల పర్యవేక్షణ ; చాలా మధుమేహులు మందులు వేసుకుంటున్నాము కదాఅని పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. కనీసం మూడు మాసాలకు ఒకమారు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీలు, నాడులు , గుండె, కంటి పనితీరును తెలుసుకోవాలి. ఏమాత్రం చిన్న సమస్యను గుర్తించినా వెంటనే చికిత్స తీసుకోవాలి.