Stomach Cancer : ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కడుపులో క్యాన్సర్ కు దారితీస్తాయా?

కడుపు క్యాన్సర్ ను తొలనాళ్లలో గుర్తించటం కష్టమౌతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు, ఇలాంటివి క్యాన్సర్ తీవ్రత పెరిగినసందర్భంలో కనిపిస్తాయి.

Stomach Cancer : ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కడుపులో క్యాన్సర్ కు దారితీస్తాయా?

Stomach Cancer :

Stomach Cancer : గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది అత్యంత సాధారణ రకం క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు మూడవ ప్రధాన కారణం. ఎక్కువగా ఆడవాళ్ళకి కడుపు క్యాన్సర్ రావడం ప్రస్తుతం చూస్తున్నాం. కడుపు క్యాన్సర్ దీనినే గ్యాస్టిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. కడుపులోని కణాలు ఆ సాధారణంగా ఎదిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ అనేది తీవ్రమైన అలాగే ప్రాణాంతక ఒక వ్యాధి.

జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ప్రధానంగా కడుపు సంబంధిత క్యాన్సర్లకు ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య భారంగా మారుతుంది. కడుపు క్యాన్సర్ ఉప్పు మరియు నైట్రేట్‌లు జోడించబడిన ఆహారాలే కారణంగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆహార కారకాలు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. ఉప్పు తీసుకోవడం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరణాలతో దగ్గరి సంబంధం కలిగి ఉందని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కడుపు క్యాన్సర్ ను తొలనాళ్లలో గుర్తించటం కష్టమౌతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు, ఇలాంటివి క్యాన్సర్ తీవ్రత పెరిగినసందర్భంలో కనిపిస్తాయి. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం చెడు ఆహార అలవాట్లు ఒకటైతే అధిక కారం, ఉప్పు వినియోగం కూడా సమస్యకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు మరియు సాల్టెడ్ ఆహార వినియోగంపై పరిమితి గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను నిరోధించడానికి ఒక ఆచరణాత్మక వ్యూహంగా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఉప్పు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, మాంసాహారం అధికంగా తినేవారిలో కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారపర్యంగా స్మోకింగ్, ఊబకాయం అలవాట్లు , రకరకాల ఇన్ఫెక్షన్లు మూలంగా కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

కడుపు క్యాన్సర్ రాకుండా ;

ఆకుపచ్చ కూరగాయలు, రంగురంగుల పండ్లు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ ప్రమాదం తగ్గిపోతుంది. తృణధాన్యాల , ముడి బియ్యం లాంటివి డైట్లో చేర్చుకోవాలి. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. అలాగే స్పైసీ ఫుడ్ మాంసం, చేపలు తక్కువగా తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వాటిని మానేయాలి. తరచుగా కడుపునొప్పి, కడుపుబ్బరం అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి కారణాలు తెలుసుకోవటం మంచిది. అవసరమనుకుంటే వైద్యులు చికిత్సను అందించేందుకు అవకాశం ఉంటుంది.