Multivitamin For Children : మీ పిల్లలకు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

కరోనా కాలంలో ప్రతిఒక్కరి ఆహార పదార్థాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ఆహారం తీసుకున్నా అందులో పోషకాహారం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయా లేదో మరి చూసుకుంటున్నారు. పిల్లల్లోనూ మల్టీ విటమిన్లు ట్యాబ్లెట్లు ఇవ్వొచ్చా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

Multivitamin For Children : మీ పిల్లలకు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Do Kids Need Vitamin Supplements

Do Kids Need Vitamin Supplements : కరోనా కాలంలో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరిగిపోయింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆహార పదార్థాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ఆహారం తీసుకున్నా అందులో పోషకాహారం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయా లేదో మరి చూసుకుంటున్నారు. పోషకాహారం కలిగిన ఆహారాన్ని తినడం వల్ల అందులోని విటమిన్లు, ఖనిజ లవణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తున్నారు. పోషకాహారంతో పాటు మల్టీవిటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. పెద్దలయితే సరే.. మరి పిల్లల సంగతేంటి? పిల్లల్లోనూ మల్టీ విటమిన్లు ట్యాబ్లెట్లు ఇవ్వొచ్చా? అలా ఇస్తే పిల్లలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

మల్టీవిటమన్లు ఇస్తే ఏమౌతుందంటే? :
వాస్తవానికి పసిపిల్లలకు మల్టీ విటమిన్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు పోషక నిపుణులు. ఎందుకంటే.. చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారంలోనే పోషకాలు అందడం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రత్యేకించి మల్టీవిటమిన్లు లేదా సిరప్ వంటి ఇవ్వడం వారి ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. పిల్లలు తినే ఆహారంలో పోషకాలు ఎంతలో ఉన్నాయి అనేది చూసుకోవాలంటున్నారు. అలాగే వేళకు ఆహారం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బరువు ఎంత ఉన్నారు? వయస్సుకు తగినంతగా ఉన్నారో లేదో గమనించాలంటున్నారు. ఒకవేళ చిన్నారులకు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తే ఏమౌతుందనే భయం చాలామందిలో కనిపిస్తోంది. మల్టీవిటమిన్లు పిల్లలకు ఇస్తే అవి విషంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.

సరైన పోషకాలు అందే ఫుడ్ మాత్రమే ఎక్కువగా అందించాలి. పిల్లల ఎదుగుదలతో పాటు ఆహారం సరిగా తినని పిల్లల్లో వైద్యుల సలహా మేరకు ఏమైనా సిఫార్సు చేస్తే విటమిన్ సప్లిమెంట్లు ఇవ్వొచ్చు. అది కూడా పరిమితంగానే అంటున్నారు. వైద్యులను సంప్రదించకుండా ఎలా పడితే అలా సప్లిమెంట్లు ఇవ్వడం పిల్లల ఆరోగ్యానికి ముప్పు అని గ్రహించాలి. సాధారణంగా చాలా మంది పిల్లల ఎదుగుదల లోపం ఉంటుంది. వయస్సు తగినట్టుగా ఎదగరు.. వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. ఇలాంటి పిల్లల్లో మాత్రమే మల్టీ విటమిన్లను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. పిల్లల జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే తగినంత పోషకాహారం అందేలా చూడాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు మల్టీవిటమిన్ల జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.