After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!

భోజనం చేసిన తరువాత స్నానం చేసే అలవాటు కొందరిలో ఉంటుంది. భోజనానికి ముందు స్నానం చేయటం మంచిది. ఎందుకంటే భోజనం చేసిన తరువాత స్నానం చేయటం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది.

After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!

After Eating

After Eating : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. కొన్ని సందర్భాల్లో కొన్నింటిని చేయకుండా ఉండటమే మంచిది. చాలా మంది రుచికరంగా ఉన్న వాటిని అతిగా లాగించేస్తుంటారు. ముఖ్యంగా బోజనం చేసిన తరువాత చిరుతిండిని తింటూ పొట్ట ఏమాత్రం ఖాళీలేకుండే నింపేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. భోజనం చేశాక ఏదిపడితే అది తింటే బరువు పెరగటంతోపాటు, పొట్ట పెరుగుతుంది. శరీరంలో కొవ్వులు పేరుకు పోయేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. భోజనం చేసిన తరువాత ఏం చేయకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. భోజనం చేసిన వెంటనే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. తిన్నవెంటనే టీ తాగటం మంచిది కాదు . ఇలా చేయటం వల్ల తేయాకులో ఉండే అమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను వినియోగించుకోకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే టీ జోలికి వెళ్ళకండి.

2. భోజనం చేసిన వెంటనే చాలా మందికి పండ్ల ముక్కలను తినే అలవాటు ఉంటుంది. అలా తినటం వల్ల తిన్నది అరిగిపోతుందని నమ్ముతారు. వాస్తవానికి భోజనం చేసిన అనంతరం పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది.

3. భోజనం చేసిన తరువాత స్నానం చేసే అలవాటు కొందరిలో ఉంటుంది. భోజనానికి ముందు స్నానం చేయటం మంచిది. ఎందుకంటే భోజనం చేసిన తరువాత స్నానం చేయటం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అదే క్రమంలో పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్ధ పనితీరు మందగిస్తుంది.

4. భోజనం చేశాక నాలుగడుగులు వేయాలని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. అయితే తిన్న మరుక్షణమే నడవటం ఏమాత్రం మంచిది కాదు. అలా నడవటం వల్ల పోషకాలను గ్రహించటంలో జీర్ణ వ్యవస్ధ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా తిన్న ఒక పావుగంట తరువాత నడవటం మంచిది.

5. పొట్ట నిండుగా తినగానే కంటిమీద కునుకు వచ్చేస్తుంది. అయితే తిన్న వెంటనే నిద్ర పోవటం ఏమాత్రం మంచిది కాదు. ఇలా నిద్ర పోవటం వల్ల తిన్న ఆహారం జీర్ణకాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.