Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?

సలాడ్‌లు తినడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గవచ్చు, కానీ పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది.

Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?

Empty Stomach

Empty Stomach : జీవనశైలిలో మార్పులు, బిజీ లైఫ్ కారణంగా చాలా మంది రోజువారిగా తాము తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు. ఏ సమయానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కనీస అవగాహన ఉండటం లేదు. ఏదో సమయంలో అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ కడుపు నింపుకుంటూ జీవితాలను సాగించేస్తున్నారు. బిజీ వలన సమయానికి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో ఖచ్చితమైన నియమం లేకుండా పోయింది. ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారాల విషయంలో చాలా మందిలో అవగాహన లేకపోవటం వల్ల ఏదిపడితే అది తినేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల అనారోగ్యాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రి నిద్రపోయి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచేంత వరకు కడుపు ఖాళీగా ఉంటుంది. ఉదయాన్నే ఆకలితో ఏదో ఒక ఆహారాన్ని తీసుకుంటుంటారు. అయితే తినే ఆహారం కారంగా, మసాలలో వండి పదార్ధాలను తినంటం ఏమాత్రం మంచిది కాదు. మసాలాలతో కూడిన ఆహారాలు త్వరగా జీర్ణం కావు. అంతేకాకుండా వీటి వల్ల గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కూల్ డ్రింకులను ఖాళీ కడుపునా తాగటం వలన జీర్ణ క్రియ మందగించడమే కాకుండా శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది.

సలాడ్‌లు తినడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గవచ్చు, కానీ పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది. పచ్చికూరగాయాలతో తయారు చేసిన సలాడ్లను పరగడుపున తీసుకోవద్దు. ఖాళీ కడుపుతో పెరుగును అస్సలు తినకండి. ఇందులో లాక్టిక్ యాసిడ్స్ పెంచే బాక్టీరియా ఉండటం వల్ల కడుపుబ్బరానికి దారి తీస్తుంది.

ఉదయాన్నే అరటి పండును తినటం మంచిదికాదు. దీనిని తినటం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం రక్తంపై ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు, రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. పియర్స్ పండును పరగడుపున తినటం వల్ల జీర్ణ పరమైన సమస్యలు వస్తాయి. జామకాయలు, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి మంచి పరిణామం కాదు ఖాళీ కడుపుతో వీటిని తింటే మీ జీర్ణవ్యవస్థ ​​అదనపు భారం పడుతుంది.

ఉదయాన్నే మద్యం తాగే అలవాటు ఉంటే మాత్రం అది మానుకోవటం మంచిది. ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే అది లివర్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చివరకు ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. పచ్చి టమోటాలను ఉదయాన్నే తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే టానిన్ యాసిడ్స్ జీర్ణ వ్యవస్ధపై ప్రభావం చూపుతాయి. టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు. వాటిని తాగటానికి ముందు ఒక గ్లాసు మంచి నీరు తాగిన తరువాత వాటిని తీసుకోవాలి. నిత్యం ఉదయం గోరువెచ్చని నీరు లేదంటే లెమన్ టీ, అల్లం టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.