Salt : రోజుకు 6గ్రాములు మించొద్దు! అధిక వినియోగంతో ముప్పు తప్పదు జాగ్రత్త!

ఉప్పు అధికంగా తినటం వల్ల జీర్ణాశయం, పేగుల్లోని మృదు చర్మం దెబ్బతిని జీర్ణమండల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఊబకాయం, మూత్రపిండాల్లో రాళ్లు, ఉబ్బసం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్రం ద్వారా క్యాల్షియం బయటకు పోవటం పెరుగుతోంది, దీనివల్ల ఎముకలు బోలుబోలుగా, పెళుసుగా తయారై ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక సమస్యలూ ఎదురవుతాయి.

Salt : రోజుకు 6గ్రాములు మించొద్దు! అధిక వినియోగంతో ముప్పు తప్పదు జాగ్రత్త!

How much salt is needed by the body

Salt : ఆహారానికి రుచి రావాలంటే ఉప్పు వాడాల్సిందే. ఇది నిజమే అయినప్పటికీ పరిమితికి మించి రోజువారి ఆహారాల్లో ఉప్పు వాడటం అన్నది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా ఉపయోగించే వారిలో రక్తపోటు , అది గుండె జబ్బులు, పక్షవాతం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. దీంతో ఉప్పు వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించమని నిపుణులు సూచిస్తున్నారు.

రోజువారిగా ఉప్పు ఎంత తీసుకోవాలి ;

రోజు వారి ఉప్పు వినియోగం విషయానికి వస్తే రోజూ 5 – 6 గ్రాములు మించకూడదు. అంటే ఒక్క టీస్పూను ఉప్పు అన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే ప్రమాణాలను సూచిస్తోంది. మన శరీరానికి సగటున రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం అవసరమౌతుంది. ఉప్పులో సోడియం, క్లోరైడ్‌ అనేవి రెండూ ఉంటాయి. 40% సోడియం, 60% క్లోరైడ్‌ ఉంటాయి. అంటే మనం 1 గ్రాము ఉప్పు తీసుకుంటే దాని ద్వారా మన శరీరానికి 400 మిల్లీగ్రాముల సోడియం లభిస్తుందన్న మాట. మనకు కావాల్సింది రోజు మొత్తమ్మీద 1500 మిల్లీగ్రాముల సోడియం కాబట్టి.. మనం రోజుకు సగటున 4 గ్రాముల ఉప్పు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. రోజువారిగా మనం తీసుకునే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుల వంటి వాటిల్లో సహజంగా కొంత సోడియం ఉంటుంది. వాటిని తీసుకుంటే సహజంగానే మనం ఎలాంటి ఉప్పు వాడకుండానే రోజుకు దాదాపు 300-400 గ్రాముల వరకు సోడియం శరీరానికి అందుతుంది.

మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ రోజుకు 9-12 గ్రాముల ఉప్పు తింటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. చిప్స్‌, బర్గర్లు, రకరకాల రెడీమేడ్‌ ఫుడ్స్‌ తినటం పెరుగుతోంది. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ప్యాకెట్లలో సిద్ధంగా ఉన్న పదార్థాల్లో ఉప్పు వినియోగం అధికంగా ఉంటుంది. అలాంటి వాటిని తినటం వల్ల శరీరానికి అధికమొత్తంలో సోడియం అందుతుంది. దీని వల్ల హైబీపీ, దాని కారణంగా సంప్రాప్తించే గుండె జబ్బులు, పక్షవాతం వంటివి అధిక ఉప్పు మూలంగా వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3 గ్రాముల కంటే ఉప్పు తక్కువగా తింటున్న సమాజాల్లో హైబీపీ సమస్య చాలాచాలా తక్కువగా ఉంటోంది. ఉప్పు, హైబీపీల మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది.

ఉప్పు అధికంగా తినటం వల్ల జీర్ణాశయం, పేగుల్లోని మృదు చర్మం దెబ్బతిని జీర్ణమండల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఊబకాయం, మూత్రపిండాల్లో రాళ్లు, ఉబ్బసం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్రం ద్వారా క్యాల్షియం బయటకు పోవటం పెరుగుతోంది, దీనివల్ల ఎముకలు బోలుబోలుగా, పెళుసుగా తయారై ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక సమస్యలూ ఎదురవుతాయి. ఒంట్లో నీరు చేరటం పెరుగుతుంది. పచ్చళ్లు, చట్నీలు, అప్పడాలు, వడియాలు, ఒరుగులు, చల్ల మిరపకాయలు, నూడుల్స్‌, చిప్స్‌, ఛీజ్‌, రకరకాల పొడులు, జ్యూసులు, పాస్తా, బిస్కట్లు, సాస్‌లు, సూపులు, పిజ్జాలు, బర్గర్లు వంటి వాటి ఉప్పు అధిక మోతాదులో ఉంటుంది. వాటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నివారించటం మంచిది. బూందీ, మిక్చర్‌, ఉప్పు చల్లిన పల్లీలు, సెనగలు, బఠాణీలు వంటివాటిలో ఉప్పు ఎక్కువే ఉంటుంది.

ఉప్పు అవసరత శరీరానికి ఎంతంటే ;

మన శరీరానికి సోడియం చాలా అవసరం, దీనికి ముఖ్యమైన వనరు ఉప్పు. సోడియం ప్రధానంగా ఒంట్లో ద్రవాల సమతౌల్యం కాపాడటం, కణాలకు అవసరమైన ఎలక్ట్రొలైట్‌లను అందింటం, నాడుల పనితీరు మెరుగ్గా ఉంచటం వంటి కీలకమైన పనులు నిర్వర్తిస్తుంటుంది. ఒంట్లో సోడియం తగ్గితే తీవ్రమైన అలసట, నిస్సత్తువ, చికాకు, వికారం, పరధ్యానం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉప్పును పరిమిత మోతాదులో తీసుకోవాలి తప్ప అసలు పూర్తిగా మానేయటం మంచిది కాదు. ఉప్పు అధికంగా తింటే బీపీ పెరగటంతో పాటు జీర్ణాశయం లోపలి జిగురు పొర దెబ్బతింటుంది. దీంతో జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు చిన్నతనం నుంచే తక్కువ ఉప్పు తినేలా అలవాటు చేయాలి. ఊరగాయలు, పచ్చళ్లు, ఉప్పులో నానబెట్టి ఎండబెట్టే పదార్థాలు- ఉప్పు చేపలు, మజ్జిగ మిరపకాయల వంటివి బాగా తగ్గించాలి. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అవసరమనుకుంటే మిరియాలపొడిని వాడుకోవటం ఉత్తమమైన మార్గం.